Big Stories

Paytm Shares: పుంజుకున్న పేటీఎం.. రెండో రోజు పెరిగిన షేర్ల ధర..

Paytm Share Price: పేటీఎం పెట్టుబడుదారులకు గుడ్ న్యూస్. పేటీఎం బ్రాండ్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు ధర పుంజుకుంది. వరుసగా రెండో రోజు పెరిగింది. బీఎస్‌ఈలో సోమవారం 5 శాతం పెరిగింది. పేటీఎం షేర్ ధర రూ.358.55 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

- Advertisement -

యాక్సిస్‌ బ్యాంక్‌తో చేతులు కలుపుతున్నామని ఇటీవల పేటీఎం ప్రకటించింది.మర్చంట్‌ సెటిల్‌మెంట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో పేటీఎం షేర్లు పుంజుకున్నాయి.

- Advertisement -

నోడల్ ఖాతా మార్పు..
పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తమ నోడల్‌ ఖాతాను పేటీఎం బ్యాంక్ నుంచి మార్చింది. నోడల్ ఖాతను యాక్సిస్‌ బ్యాంకుకు షిఫ్ట్ చేసింది. అందువల్లే పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషీన్‌ సేవలు మార్చి 15 తర్వాత వ్యాపారులకు మామూలుగానే కొనసాగుతాయని ప్రకటించింది.

నోడల్‌ ఖాతా అంటే ఏంటి?
సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలను నోడల్ ఖాతా ద్వారానే సెటిల్‌‌ చేస్తారు. జనవరి 31న పేటీఎం పేమంట్ బ్యాంక్ పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం .. ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లు, ఎన్‌సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాలిచ్చింది. మళ్లీ ఆ గడువును ఆర్బీఐ పొడిగించింది. మార్చి 15 వరకు గుడువు ఇచ్చింది.

ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం కంపెనీ షేర్లలో పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో పేటీఎం సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారుల్లో విశ్వాసం పెరిగింది. ఇప్పటి వరకు షేర్లు అమ్మేందుకు పోటీ పడిన పెట్టుబడుదారుల.. మళ్లీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ధర పెరిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News