Maruti Suzuki e-Vitara: ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ కల సాకారం మొదలైంది. తొలి మారుతి సుజికీ ఈవీ కారుని జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. దీంతో ఆ కంపెనీ నుంచి ఇండియాలో తయారైన ఈ-కారు మార్కెట్లోకి అడుగుపెట్టేసింది. గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేసే కార్లను 100 దేశాలకు ఎగుమతి చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఆ కంపెనీ.
భారత్‌తో విద్యుత్ వాహనాల కార్ల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధాని మోదీ. ఒకటి మారుతీ సుజుకీ తొలికారు ఇ-విటారా కాగా, హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే
మొదటి ప్లాంట్‌కు జెండా ఊపారు.
గుజరాత్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఓనో సైతం హాజరయ్యారు. కార్ల ప్లాంట్ ప్రారంభం ‘స్వయం సమృద్ధ భారత్’ అన్వేషణలో ప్రత్యేకమైన రోజుగా వర్ణించారు ప్రధాని. ఆ ప్రాంతంలో తయారయ్యే విద్యుత్ ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది ఆ కంపెనీ.
ప్రారంభించిన తొలి ఈ-విటారా ద్వారా తయారైన కారుని యూకేకు పంపనున్నారు. తొషిబా-డెన్సో-సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఆ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానుంది. 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధంకానుందని తెలుస్తోంది. ఇ-విటారా కారు మార్కెట్లోకి వచ్చేసింది. అయితే దాని ప్రత్యేకతలు ఏంటి? ప్రారంభ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని ఓ అంచనా.
ALSO READ: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
మారుతీ సుజుకీ ఇ-విటారా బ్యాటరీ ఆప్షన్లతో (49kWh, 61kWh) రాబోతోంది. తొలుత 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్‌పీ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 61kWh బ్యాటరీ 174 హెచ్‌పీ శక్తి కాగా, 189 Nm టార్క్‌ను విడుదల చేయనుంది. అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ మాట.
మారుతీ సుజుకీ ఈవీలు కొనుగోలు చేసేవారికి బంపరాఫర ఇచ్చింది ఆ కంపెనీ. స్మార్ట్ హోమ్ ఛార్జర్, ఇన్‌స్టలేషన్ సపోర్ట్‌ను అందించనుంది. తొలిదశలో 100 ప్రధాన సిటీల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను అందించనుంది. ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య మారుతీ సుజుకీ కంపెనీ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు కూడా.
మారుతీ సుజుకీ ఈవీ కారును ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం
మారుతీ సుజుకీ తొలి కారు ఇ-విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ… pic.twitter.com/2ke5nLGk6G
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025