Gold Rates Today: ప్రస్తుతం బంగారం ధరలు ఒకరోజు తగ్గుతూ.. ఒకరోజు పెరుగుతూ.. ఉన్నాయి. కానీ ఎంత తగ్గినా మరుసటి రోజు దానికి రెండింతలు పెరుగుతుంది. ఇలా రోజు పెరుగుతూ పోతే పసిడి ప్రియలు బంగారం పై ఇష్టాన్ని చంపుకోవాల్సిందేనా..? సోమవారం రోజూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 ఉండగా.. మంగళవారం నాడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,060 వద్ద పలుకుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 93,050 కాగా.. నేడు 93,550 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్క రోజే 10 గ్రాముల బంగారం పై రూ.550 పెరిగింది.
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..
నిన్నమోన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా అందలాన్ని తాకుతున్నాయి. దీని వల్ల పసిడి ప్రియులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. బంగారం కొనాలంటే బయపడుతున్నారు. బంగారం షాపుల్లో కొనుగోలు దారుల రద్దీ కూడా రోజు రోజుకు తగ్గుతుంది. నిన్నమోన్న శ్రావణ మాసం పండుగల సమయం కావున బంగారం పెరిగింది.. శ్రావణ మాసం పోయిన అనంతరం మళ్లీ తగ్గింది.. కానీ.. ఇప్పుడ మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పసిడి ప్రియులు బంగారం కొనాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది.
బంగారం పెరుగుటకు కారణాలు..
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధించారు. దీని కారణంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతేకాకుండా, రూపాయి విలువ బలహీనపడటం వల్ల కూడా దేశీయ మార్కెట్లో బంగారం మరింత పెరగడానికి కారణమవుతుంది.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
సోమవారం నాడు బంగారం ధరలతో .. మంగళవారం బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,510 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,060 వద్ద కొనసాగుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,050 కాగా.. నేడు రూ.93,550 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,060ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,550 వద్ద ఉంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,150 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర తులం బంగారం ధర రూ.91,800 వద్ద కొనసాగుతోంది.
ముంభై బంగారం ధరలు
ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,060 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,550 వద్ద పలుకుతోంది.
ఢీల్లీ బంగారం ధరలు
ఢీల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,210 కాగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,700 వద్ద ఉంది.
Also Read: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా?
నేటి సిల్వర్ ధరలు..
బంగారం రేటు పెరిగిన నేను పెరగను తగ్గుతా అంటూ.. సిల్వర్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.. నిన్నటి మోన్నటి వరకు బంగారం, సిల్వర్ ధరలు తగ్గేదేలే అంటూ పెరుగుతూ పోయాయి. కానీ, ఇప్పుడు బంగారం రేటు పెరుగుతున్న సిల్వర్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. అయితే సోమవారం కేజీ సిల్వర్ ధర రూ.1,31,000 వద్ద ఉండగా.. మంగళవారం కేజీ సిల్వర్ ధరలు రూ.1,30,000 వద్ద కొనసాగుతుంది. అంటే కేజీపై రూ.1000 తగ్గిందని చెప్పవచ్చు. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లీ ప్రాంతాల్లో రూ.1,20,000 కొనసాగుతోంది.