Gundeninda GudiGantalu Today episode October 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. భరత నాట్యం చేస్తున్న ప్రభావతిని చూసిన బాలు షాక్ లో బిగుసుకుపోతాడు.. ఈ వయసులో రిస్క్ అవసరమా అని సత్యం ఎంత చెప్పిన సరే ప్రభావతి మాత్రం ప్రభావతి 2.0 అంటూ డాన్స్ స్కూల్ గురించి చెప్తుంది. ప్రభావతి కామాక్షి ఇంట్లో ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్ గురించి అందరికీ చెప్తుంది. రిబ్బన్ కట్ చేయడానికి శృతి వాళ్ళ అమ్మని పిలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ముందు జ్యోతి ప్రజ్వల చేయాలి అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. దీంతో రిబ్బన్ కట్ చేస్తే నా డాన్సర్ స్కూల్ మూసుకోవాల్సిందే అని ప్రభావతి అనుకుంటుంది. ఇద్దరి కోడళ్లతో జ్యోతి వెలిగించినప్పుడు నా భార్యతో రిబ్బన్ కట్ చేయాల్సిందే అని బాలు వార్నింగ్ ఇస్తాడు.. ప్రభావతికి అందరూ షాక్ ఇస్తారు..
ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. ముగ్గురు కోడల్ని ఒకేలా చూడడం ఎప్పుడు నేర్చుకుంటావో తెలియడం లేదు అంటూ సత్యం కూడా ప్రభావతికి గడ్డి పెడతాడు. శృతి మా చేత దీపం వెలిగించారు కదా.. మరి మీనా చేత రిబ్బన్ కట్ చేయించాల్సిందే అని అంటుంది. తను కూడా మనిషే కదా డబ్బులు ఉంటేనే మీరు ఒకలాగా చూస్తారా లేదంటే మనిషి లాగా కూడా చూడరా అంటూ పెద్ద క్లాస్ పీకుతుంది. ఈ విషయంలో నేను బాలోకి సపోర్ట్ గానే ఉంటాను. బాలు అన్నది కరెక్టే అంటూ శృతి అంటుంది. అయినా మనోజు రోహిణి మాత్రం ఈ విషయం గురించి మాట్లాడరు..
గుడి ముందు అడుక్కునే వాడి భార్య కూడా దీపం వెలిగించింది అంటే నా భార్యకేం తక్కువ అని కావాలనే రోహిణి మనోజ్ ని బాలు రెచ్చగొడతాడు. రోహిణి సీరియస్ అవుతుంది. బాలు ఆ గుడి ముందు అడుక్కోవడం గురించి పక్కన పెట్టేస్తావా ఇక ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవా అని రోహిణి సీరియస్ అవుతుంది. ప్రభావతి ఇదంతా కాదు అని ఇంకా మీనా చేత రిబ్బన్ కట్ చేయిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభావతి మాత్రం అక్కడే ఉంటుంది. ఆ డాన్స్ క్లాస్ గురించి అందరికీ తెలిసేలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
కాసేపటి తర్వాత మీనా ప్రభావతి దగ్గర డాన్స్ నేర్చుకోవాలి అక్కడికి వస్తుంది. కామాక్షి ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి వదిన ఎవరు రాలేదా ఈగలు తోలుకుంటున్నావా అని సెటైర్లు వేస్తుంది. నువ్వు ఊరుకో కామాక్షి ఇప్పుడే కదా మొదలుపెట్టింది మన గురించి మనం చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది కదా అని అంటుంది. అయితే పబ్లిసిటీ ఎక్కువగా చేయాలి. అప్పుడే అందరికీ తెలిసిపోతుంది అని కామాక్షి సలహా ఇస్తుంది. ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది. కామాక్షి వెళ్లి తలుపు తీయగానే బాలు మీనా ఇద్దరు ఎదురుగా కనిపిస్తారు.
Also Read : ధీరజ్ తో ప్రేమ..శ్రీవల్లికి టెన్షన్.. పరువు కాపాడిన నర్మద..
మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ప్రభావతి.. దగ్గర డాన్స్ నేర్చుకోవాలని వచ్చాను అత్తయ్య నన్ను మీ శిష్యురాలుగా జాయిన్ చేసుకోండి అని మీనా రిక్వెస్ట్ చేస్తుంది. ప్రభావతి మాత్రం డాన్స్ పేరుతో నువ్వు ఇక్కడ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని అడుగుతుంది.. కొంచెమైనా ఆలోచించు అసలు డాన్స్ గురించి నీకేం తెలుసు అని నేను అవమానించేలా మాట్లాడుతుంది. నేర్పిస్తే నేను కచ్చితంగా చేస్తాను నన్ను చేర్చుకోండి గురువుగారు అని మీనా అంటుంది. ఇక మీనా ను జాయిన్ చేసుకున్న ప్రభావతి. డాన్స్ నేర్పిస్తుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. హైలెట్ కాబోతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..