BigTV English

Hongqi L5: చైనాలో ప్రధాని మోదీ.. ఆ కారులో ట్రావెల్ ఎందుకు? దాని స్పెషలేంటి?

Hongqi L5: చైనాలో ప్రధాని మోదీ.. ఆ కారులో ట్రావెల్ ఎందుకు? దాని స్పెషలేంటి?

Hongqi L5: ఏడేళ్ల తర్వాత రెండు రోజుల టూర్‌‌కి చైనా వెళ్లారు ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ ప్రధాని మోడీ అత్యంత ఖరీదై కారులో ట్రావెల్ చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. హాంగ్కీ L5 కారులో ట్రావెల్ చేశారు. ప్రధాని ప్రయాణించిన కారు ‘మేడ్ ఇన్ చైనా’. దాని పేరు హాంగ్చీ-ఎల్‌5. చైనాలో అత్యంత విలాసవంతమైన కారుగా ప్రసిద్ధి చెందింది. హాంగ్కీ బ్రాండ్‌ను ‘చైనా రోల్స్ రాయిస్’ కారుగా పిలుస్తారు.


చైనాలో ఫేమస్ కారు హాంగ్చీ-ఎల్‌ 5 ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ కారు స్పెషాలిటీ ఏంటి? మాండరిన్ భాషలో హాంగ్చీ అంటే ఎర్ర జెండాగా వర్ణిస్తారు. ఒకప్పుడు ఆ కారుని చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఆ దేశంలో ఓ లగ్జరీ సింబల్‌గా మారింది. ప్రధాని మోదీ ఆ కారులో ప్రయాణించడంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.

హాంగ్చీ-ఎల్‌ 5 సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ L5 సిరీస్ వాహనాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, సందర్శించే ప్రముఖుల కోసం వీటిని కేటాయిస్తారు. కారు గురించి చెప్పనక్కర్లేదు. ధర-అధునాతన భద్రతా వ్యవస్థ దాని సొంతం.


1958లో చైనా ప్రభుత్వ మావో జెడాంగ్ కాలంలో ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్-FAW కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల అధికారిక వాహనంగా హాంగ్కీని అభివృద్ధి చేసింది. అలా మొదటిసారి ప్రవేశపెట్టారు. దశాబ్దాలుగా ఆ బ్రాండ్ కార్లను కేవలం ఉన్నతాధికారులు, దేశాధినేతలకు పరిమితం చేశారు.

ALSO READ: గంటకు రూ.2.7 లక్షల అమ్మకాలు, ఏడాదికి రూ.49 వేల కోట్ల ఆదాయం

1980 దశకంలో చైనాలోకి విదేశీ లగ్జరీ బ్రాండ్ల కార్లు రావడంతో వాటి ఉత్పత్తి నిలిచివేసింది.  చివరకు హాంగ్కీ ప్రతిష్ట క్షీణించింది. చివరకు 1990 దశకం జిన్‌పింగ్ నాయకత్వంలో ఈ బ్రాండ్ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది. హాంగ్కీ L5 కారు చైనాలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలిచింది. 2018లో FAW హాంగ్కీని కొత్త డిజైన్ ‘మేడ్ ఇన్ చైనా’ లగ్జరీ కారుగా గుర్తింపు తెచ్చుకుంది.

ధర దాదాపు 5 మిలియన్ యువాన్లు అంటే భారత్ కరెన్సీలో సుమారు రూ. 7 కోట్లు అన్నమాట. ఆ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. హాంగ్కీ నాలుగు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వాటిలో L, S, H, Q వంటివి ఉన్నాయి. L సిరీస్ కేవలం రాష్ట్ర నాయకులు ఉపయోగించే అత్యున్నత లగ్జరీ లైన్‌ను సూచిస్తుంది. S సిరీస్ పని తీరు, శైలి కోసం రూపొందించబడింది. H సిరీస్ ప్రధాన స్రవంతి కారుగా ఉంచబడింది. Q సిరీస్ వాహనాలను వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారు.

హాంగ్కీ-L5 వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాదాపు 5.5 మీటర్ల పొడవు ఉంటుంది. దాదాపు 3,100 కిలోగ్రాముల బరువు కలదు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.5 సెకన్లలో అందుకోగలదు. గంటకు గరిష్ఠంగా 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం క్రూయిజ్ మోడ్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించింది ఆ కంపెనీ.

పార్కింగ్ కోసం సెన్సర్లు, 360-డిగ్రీ కెమెరాలు దీని సొంతం. లోపల అత్యంత విశాలమైన, విలాసవంతమైన సీట్లు ఉన్నాయి. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 లేదా 6.0-లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. భద్రత కోసం వాహనం రన్-ఫ్లాట్ టైర్లు, భారీ ఆర్మర్ ప్లేటింగ్, బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు దీని ప్రత్యేకత.

కొన్నాళ్లుగా హాంగ్కీ కారుని రిచర్డ్ నిక్సన్, ఫ్రాంకోయిస్ హోలాండ్ వంటి ప్రపంచ నాయకులకు కేటాయించేవారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరిపోయారు. 2019లో చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ భారత్ వచ్చినప్పుడు తమిళనాడులోని మహాబలిపురం హాంగ్కీ L5 కారులో ప్రయాణించారు.

Related News

BSNL Freedom Plan: జస్ట్ వన్ రూపీ.. డైలీ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్!

Airtel Offers: ఇంటర్నెట్ ఇంత చవకా?.. ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ వైఫై!

Jio Offers: 5జీ స్పీడ్.. కేవలం రూ.51కే.. జియో అదిరిపోయే ఆఫర్!

DMart Record: గంటకు రూ. 2.7 లక్షల అమ్మకాలు, ఏడాదికి రూ. 49 వేల కోట్ల ఆదాయం!

GOLD RATE IN DUBAI: దుబాయ్‌లో బంగారం ధర చాలా చీప్.. భారత్‌తో పోలిస్తే ఎంత డబ్బు ఆదా..?

Big Stories

×