Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తొలిగిపోయాయా అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎప్పటినుంచో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. కానీ, అటు మెగా కుటుంబం, ఇటు అల్లు కుటుంబం పైకి ఏమిలేదు అని చెప్పుకొస్తున్నా.. లోపల మాత్రం అంటీముట్టనట్లు ఉండడం అందరికీ తెల్సిందే. ఇక ఈ ఏడాదిలో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. అందుకు కారణం అల్లు అర్జున్.
చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన తరుపున కాకుండా.. వేరొక పార్టీ ప్రచారానికి వెళ్లడం రెండు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారాన్ని రేపింది. దీనివలన మెగా కజిన్స్ విడిపోయారు. ఇక్కడితో ఈ గొడవ ఆగిందా అంటే లేదు.. పవన్ గెలిచినప్పుడు అల్లు అర్జున్ వచ్చి కలవలేదు. అదొక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇది పర్సనల్ గొడవ నుంచి రాజకీయ గొడవగా మారింది.
అయితే లోపల ఎన్ని జరిగినా.. ఎవరెవరూ మనసులో ఎన్ని పెట్టుకున్నా.. అల్లు ఫ్యామిలీకి అండగా మెగా కుటుంబం ఉంటుందని ఎప్పటికప్పుడు చిరంజీవి నిరూపిస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసులో అరెస్ట్ అయ్యినప్పుడు మొదట అతనిని కలిసి పరామర్శించింది చిరునే. పవన్ కూడా బన్నీకి సపోర్ట్ గా మాట్లాడాడు.
ఇక ఇవన్నీ పక్కనపెడితే.. మొన్న అల్లు కనకరత్నం మరణం ఈ రెండు కుటుంబాలను మరోసారి దగ్గరచేసింది. మళ్లీ కనిపించరేమో అనుకున్న వారందరూ.. ఒకే చోట కనిపించారు. చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా ఈ రెండు కుటుంబాలను ఆమె మరణం కలిపింది. బన్నీతో పవన్ మాట్లాడాడు. అలా ఈ ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
ఇక నాయనమ్మ మరణం బన్నీని మార్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఎప్పుడు లేనివిధంగా ఈసారి పవన్ బర్త్ డే కు ముందే బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ” పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా – అల్లు కుటుంబాలు ఇలానే కలిసి ఉండాలి అని కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు.