Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులో ఏదో వైబ్రేషన్ ఉంది. ఎవడి మాట వినడు.. ఏది చెప్పినా నమ్మడు. తొలిచూపులోనే అందరి ప్రేమను పొందుతాడు. ముక్కుసూటి మనిషి.. ప్రజలంటే ప్రాణం. ప్రజాసేవ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వీరుడు. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్టార్.. ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత ఇలా చెప్పుకుంటూ పోతే పవర్ స్టార్ గురించి ఎన్నో ఉంటాయి. ఒక సినీ నటుడుగా కెరియర్ ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రజానేతగా ఎదిగాడు పవన్ కళ్యాణ్. నేడు పవర్ స్టార్ పుట్టిన రోజు. ఈయన పుట్టినరోజు సందర్భంగా ఊరువాడా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు చెప్తున్నారు.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
డైరెక్టర్ టు హీరోగా పవన్ కళ్యాణ్ జర్నీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్ళు ఉండరు. స్వయంకృషితో పైకొచ్చిన హీరో. మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ఒక్కో సినిమాతో స్టార్ ఇమేజ్ ని పెంచుకున్నారు.. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. ఆయన ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే మొదట డైరెక్టర్గా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ సినిమా కూడా చేశాడు. కానీ చిరంజీవి భార్య సురేఖ వల్ల హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరో అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన నటనతో అభిమానుల గుండెల్లో దేవుడయ్యాడు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్..
ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్..?
1996లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమ్యారు. తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. సుప్రీత యార్లగడ్డ, శరత్ బాబు నటించారు. ఈ సినిమాకు గాను నెలకు రూ. 5 వేలు తీసుకున్నారట. అలా సినిమా పూర్తయ్యేంతవరకు 50,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారట పవన్ కళ్యాణ్. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు. ఆ డబ్బులతో ఒక మినీ గ్రంథాలయం ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత సినిమాకు రెండు లక్షలు, ఇలా తన స్టార్గం పెరిగే కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది..
ప్రజానాయకుడిగా జనసేనాని..
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడ్డాడు. మొదట పరాజయం పాలైనా కూడా అలుపెరగని వీరుడిలాగా మళ్లీ ఎన్నికల్లో నిలబడ్డాడు. నేరుగా ఆయనే ఎన్నికల్లో నిలబడడంతో అభిమానులు ఆయనను గెలిపించారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టాడు.. ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే తీరికలేని బిజీతో ఉన్నా కూడా.. ముందుగా ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేశాడు.
Also Read : ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలి..తమ్ముడికి చిరు ఎమోషనల్ విషెస్..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..
ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ గతంలో సైన్ చేసిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. మొదటగా హరిహర వీరమల్లు సినిమా థియేటర్లోకి వచ్చింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ టాక్ ని అందుకోలేదు.. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేశాడు.. ఈ మూవీ ఈనెల 25న థియేటర్లలోకి రాబోతుంది.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని. బిగ్ టీవీ కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్…