DMart: డిమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను అందిస్తూ.. పేద, మధ్య తరగతి వినియోగదారులకు చేరువ అయ్యింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ సంస్థాపించిన డిమార్ట్.. పెద్ద నగరాల నుంచి ఇప్పుడు పట్టణాల వరకు విస్తరించింది. అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునేలా చౌక ధరలకే చక్కటి వస్తువులను అందిస్తోంది. నిత్యవసర సరుకుల నుంచి గృహోపకరణాల వరకు, పాదరక్షల నుంచి దుస్తుల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. ఫుడ్, శుభ్రపరిచే లిక్విడ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తులు, వంటగది సామాగ్రి, బెడ్, బాత్ లినెన్, గృహోపకరణాలు సహా బోలెడు వస్తువుల లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే డిమార్ట్ లోకి వెళ్తే, మనకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. అందుకే, డిమార్ట్ స్టోర్లు ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతాయి. ఎన్నో పోటీ స్టోర్లు ఉన్నప్పటికీ, ధర తక్కువ, మన్నిక ఎక్కువ ఉండటంతో చాలా మంది డిమార్ట్ లోనే షాపింగ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రోజు రోజుకు డిమార్ట్ కు డిమాండ్ పెరుతూనే ఉంది.
ఆదాయంలోనూ దుమ్మురేపిన డిమార్ట్
వినియోగదారుల నుంచి మంచి ఆదరాభిమానాలు పొందుతున్న నేపథ్యంలో డిమార్ట్ ఆదాయంలోనూ దుమ్మురేపుతోంది. ప్రతి ఏటా లాభాల సూచీ పై పైకి వెళ్తుంది. 2024లో డిమార్ట్ రికార్డు డ్రేక్ చేసింది. ఏడాదిలో ఏకంగా రూ. 49,533 కోట్ల ఆదాయాన్ని గడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 365 స్టోర్ల నుంచి ఈ ఆదాయం లభించింది. అంటే, సగటున గా ఒక స్టోర్ రోజుకి దాదాపు రూ. 37 లక్షలు అమ్మకాలు చేస్తుంది. గంటకి సుమారు సుమారు రూ. 2.7 లక్షలు సంపాదిస్తుంది. డిమార్ట్ స్థాపించినప్పటి నుంచి ప్రతి ఏటా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ రిటైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. స్థిరత్వం, వినియోగదారుల నమ్మకం కలిపి ఈ రోజు డిమార్ట్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యింది.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?
డిమార్ట్ గురించి..
డిమార్ట్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న స్టోర్లను అదే సంస్థ నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. డి మార్ట్, డి మార్ట్ మినిమాక్స్, డి మార్ట్ ప్రీమియా, డి హోమ్స్, డచ్ హార్బర్, ఇతర బ్రాండ్లు ASL యాజమాన్యంలో ఉన్నాయి. దీని వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని. ఆయన పేరు మీదుగా దీనికి డిమార్ట్ అని పేరు పెట్టారు. భారతీయ కుటుంబాల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి రాధాకిషన్, అతని కుటుంబం 2002లో డిమార్ట్ ను ప్రారంభించారు. డి-మార్ట్ ప్రధాన లక్ష్యం వినియోగదారులకు తక్కువ ధరలో క్వాలిటీ ఉత్పత్తులను అందించడం. 2002లో ముంబైలోని పోవైలో డిమార్ట్ తన మొదటి స్టోర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించింది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?