E-Paper
Advertisement

సొంతింటి కల నెరవేర్చుకునే ఛాన్స్… 2029 వరకు కేంద్ర ప్రభుత్వ పథకంలో దరఖాస్తులు.. అర్హతలు ఇవే

సొంతింటి కల నెరవేర్చుకునే ఛాన్స్… 2029 వరకు కేంద్ర ప్రభుత్వ పథకంలో దరఖాస్తులు.. అర్హతలు ఇవే
Advertisement

PMAY Urban 2.0: సొంతంగా ఒక ఇల్లు ఉండాలనేది ప్రతి మధ్యతరగతి మనిషి జీవితంలో ఒక పెద్ద కల. ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలు, పెరిగిపోతున్న నిర్మాణ ఖర్చుల కారణంగా చాలామందికి ఆ కల, కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి సామాన్యుల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ‘PMAY-అర్బన్ 2.0’ (PMAY-Urban 2.0) పథకాన్ని అమలు చేస్తోంది. 2024 నుంచి 2029 వరకు ఐదేళ్ల పాటు కొనసాగే ఈ స్కీమ్‌లో, అర్హత ఉన్నవాళ్లు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకుని భారీ ఆర్థిక సాయం పొందొచ్చు. అయితే ఇందులో అందరికీ ఒకే రకమైన సబ్సిడీ రాదు.. మీ కుటుంబ ఆదాయం ఎంత? దేశంలో ఎక్కడైనా పక్కా ఇల్లు ఉందా? గతంలో ఏదైనా ప్రభుత్వ ఇంటి పథకం కింద లబ్ధి పొందారా? అనే రూల్స్ ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎంత సబ్సిడీ వస్తుంది? అసలు నిబంధనలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఆదాయాన్ని బట్టి అర్హత.. 

PMAY-అర్బన్ 2.0 పథకం కింద పట్టణాల్లో నివసించే మూడు రకాల కుటుంబాలకు సొంతింటి కల నిజం చేసుకునే అవకాశం ఉంది. మీ కుటుంబం ఏడాది సంపాదన రూ. 3 లక్షల లోపు ఉంటే మొదటి విభాగం (EWS), రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉంటే రెండో విభాగం (LIG), ఇక రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల లోపు ఉంటే మధ్యతరగతి విభాగం (MIG) కిందకు వస్తారు.

Advertisement

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది.. ఈ పథకానికి దరఖాస్తు చేసే వాళ్ల పేరు మీద కానీ, వాళ్ల కుటుంబ సభ్యుల (భార్యాభర్తలు, పెళ్లికాని పిల్లలు) పేరు మీద కానీ దేశంలో ఎక్కడా సొంతంగా పక్కా ఇల్లు ఉండకూడదు. ఒకవేళ మీ సొంతూరిలో (పల్లెటూరిలో) పక్కా ఇల్లు ఉన్నా సరే, ఈ పథకం కింద ఇల్లు రాదు. అంతేకాదు, గత 20 ఏళ్లలో ఏ ప్రభుత్వ పథకం ద్వారా అయినా ఇల్లు తీసుకున్న వాళ్లకు మళ్లీ అవకాశం ఉండదు.

అలాగే గతంలో PMAY కింద ఇల్లు మంజూరై, ఏవైనా కారణాలతో 2023 డిసెంబర్ 31 తర్వాత ఆ మంజూరు రద్దయిన వాళ్లకు కూడా ఈ కొత్త పథకంలో ఇల్లు ఇవ్వరు. కానీ సమాజంలో చేయూత అవసరమైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వాళ్లకు ఈ స్కీమ్‌లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

దరఖాస్తులు ఎప్పటి వరకు?

Advertisement

PMAY-అర్బన్ 2.0 పథకం 2024 నుంచి 2029 వరకు అమల్లో ఉంటుంది. ఇందులో కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి, రెడీగా ఉన్న ఇల్లు కొనుగోలు చేయడానికి మరియు తక్కువ ధరకే అద్దె ఇల్లు పొందడానికి వేర్వేరు విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా EWS, LIG, MIG కుటుంబాలు బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుంటే.. ఆ రుణం వడ్డీపై సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉంది. ఈ విభాగం కింద అర్హులైన వాళ్లకు గరిష్ఠంగా రూ. 1.80 లక్షల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. అయితే మీ కుటుంబ ఆదాయం, తీసుకున్న లోన్ మొత్తం, ఇంటి విలువ ఆధారంగానే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందే మీ రాష్ట్రంలో, మీ పట్టణంలో ఈ పథకం అమలవుతుందో లేదో అధికారిక PMAY-U 2.0 వెబ్‌సైట్లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసినంత మాత్రాన ఇల్లు లేదా సబ్సిడీ గ్యారెంటీగా వచ్చేస్తుందని అనుకోవద్దు. మీరు ఇచ్చిన వివరాలను, పత్రాలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించిన తర్వాతే ఈ పథకం ప్రయోజనం మీకు అందుతుంది.

Read Also: మీరు SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్… జర జాగ్రత్త

Related News

లంచ్ బ్రేక్ స్కిప్.. గంట ముందే ఇంటికి.. ఉద్యోగికి కంపెనీ బిగ్ షాక్!

ఆన్‌లైన్‌లో ఇల్లు కొనాలని చూస్తున్నారా? బుక్ చేసే ముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి

40 ఏళ్ల వయసులో రూ.3 కోట్ల రిటైర్మెంట్ ఫండ్… ప్రతి నెలా ఎంత SIP చేయాలో తెలుసా?

సామాన్యుడి జేబుకు చిల్లు… డిసెంబర్ 1 నుంచి గ్యాస్, కార్ల ధరలు చేంజ్… క్రెడిట్ కార్డు రూల్స్ కూడా

మీరు SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్… జర జాగ్రత్త

బతికుండగానే ‘అంత్యక్రియల’కు అడ్వాన్స్ బుకింగ్.. మార్కెట్లోకి కొత్త బిజినెస్.. రూ.6,000 నుంచి ప్యాకేజీ ప్రారంభం!

పెళ్లి తర్వాత భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ తెరవాలా? వేర్వేరు ఖాతాలు ఉంచుకోవాలా?

Big Stories

Advertisement
×