E-Paper
Advertisement

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!
Advertisement

Mithilesh Reddy:అగ్ని పరీక్ష సీజన్ 2లో టాప్ 15లో సందడి చేసిన కంటెస్టెంట్స్ తో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అగ్నిపరీక్ష సక్సెస్ పార్టీ అంటూ ఒక ఈవెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో అమన్, రామకృష్ణ ఉండడంతో మిగిలిన 13 మందిని ఇక్కడ పిలిపించి మరీ షో కి హైప్ తీసుకురావాలని చూశారు నిర్వాహకులు. అయితే అగ్ని పరీక్ష 2, బిగ్ బాస్ షోలలో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలా అయితే ఒకరిపై ఒకరి విమర్శలు గుప్పించుకొని వైరల్ అయ్యారో.. ఇప్పుడు ఈ షోలో కూడా అంతకుమించి పర్ఫార్మ్ చేస్తూ షోకి మంచి కంటెంట్ ఇస్తున్నారని చెప్పవచ్చు.

మిథిలేష్ పై చేయి చేసుకోబోయిన రోహిత్..

ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ కి సంబంధించి విడుదల చేస్తున్న ప్రోమోలలో ఒక్కో ప్రోమో షోపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. నిన్న విడుదల చేసిన ప్రోమోలో రోహిత్ వర్సెస్ అపూర్వ మధ్య గొడవ ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు అదే అపూర్వ కారణంగా శాలిని గొడవ పెట్టుకోవడం, మధ్యలోకి మిథిలేష్ రావడం.. మిథిలేష్ పై రోహిత్ చేయి చేసుకునే ప్రయత్నం చేయడం.. దాంతో మిథిలేష్ షో నుండి వెళ్లిపోవడం అన్నీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

అపూర్వ వర్సెస్ శాలిని..

Advertisement

ఇకపోతే తాజాగా విడుదల చేసిన మరో ప్రోమో విషయానికి వస్తే.. నామినేషన్ వార్ లో భాగంగా అపూర్వ రోహిత్ ను నామినేట్ చేస్తున్నానని చెప్పి రెచ్చిపోయింది. అటు రోహిత్ కూడా తనదైన మాటలతో ఫైర్ అయ్యాడు.అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆ తర్వాత షాలిని నామినేషన్ లో భాగంగా మిథిలేష్ ను నామినేట్ చేయాలనుకున్నాను. కానీ కాసేపటి క్రితం జరిగిన వివాదం కారణంగా నేను అపూర్వని నామినేట్ చేస్తున్నాను అంటూ అపూర్వని స్టేజ్ పైకి పిలిచింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్స్ కి చేరింది. ఆ తర్వాత అపూర్వ మాట్లాడుతూ.. ‘అగ్నిపరీక్ష సీజన్ 2 లో టికెట్ 2 ఫినాలే రేసులో.. చాలా చిన్న టాస్క్.. బట్టలు మడత పెట్టే టాస్క్ లో ఆమె గెలిచేది.

గొడవలు దూరిన మిథిలేష్, రోహిత్..

కానీ మిథిలేష్ ఉంటే అతని బట్టలు లాగి పడేసింది.. ఎందుకంటే నేను గెలవడం కాదు పాయింట్.. అతను గెలవకూడదు. పక్కనోడు గెలవొద్దు నాయనా అంటూ అపూర్వ షాలిని గురించి చెబుతుండగానే.. మధ్యలో రోహిత్ మాట్లాడుతూ..” నువ్వు గెలవాలంటే.. పక్కనోడు గెలవకూడదు కదా” అంటూ చెబుతుండగానే.. మధ్యలో మితిలేష్ రెడ్డి మాట్లాడుతూ.. తను ఆల్రెడీ గెలుస్తుంది కదా.. అక్కడ గెలిచేది ఎందుకు పాడు చేసుకోవడం ? అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

షో నుండి వెళ్లిపోయిన మిథిలేష్..

Advertisement

రోహిత్ ” అరే తన ఇష్టం రా భాయ్.. మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావ్ ” అని ప్రశ్నించాడు.” అది నా టాస్క్ రా అందుకే మధ్యలోకి వస్తున్నా అన్నాడు”. దానికి రోహిత్ “నువ్వు రా.. గీ.. అనకు..ఒక్కటిస్తాను ” అంటూ చెయ్యెత్తి కొట్టబోయే ప్రయత్నం చేశాడు. ఇక మితిలేష్ రెడ్డి హోస్ట్గా వ్యవహరిస్తున్న శ్రీముఖి, అవినాష్ దగ్గరకి వచ్చి.. “రోహిత్, షాలిని ఉంటే ఈ షో కి నేను రాను అని ముందే చెప్పాను కదా” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

also read:ఓటీటీలోకి జయసుధ సమ్మర్ హాలిడేస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆ 15 లక్షల డబ్బుల కోసం అడుక్కున్నాడు – షాలిని

ఇక దీనికి షాలిని మాట్లాడుతూ..” ఆ 15 లక్షల డబ్బులు రావడానికి అడుక్కున్నాడు ఓట్ల కోసం.. అక్కడ గుర్తు రాలేదా ? రోహిత్, షాలిని ఓట్లు కావాల్సి వచ్చిందని అంటూ ఆమె అరిచింది. మొత్తానికైతే ఈ విషయాలన్నీ కూడా ప్రోమోలో చూపించారు మరి ఇదంతా టీఆర్పీ రేటింగ్ కోసం చేసిన ఫ్రాంక్ ఆ లేక నిజంగానే జరిగిందా? అనే విషయం తెలియాలి అంటే ఆదివారం ఉదయం 11:00 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే

 

Related News

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?

ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!

సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్

హౌస్ లో గొడవపడ్డ ఆర్కే- రామ్ ప్రసాద్.. అసలేం జరుగుతోంది?

చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!

యాంకర్ సౌమ్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? పాప రిచ్..

Big Stories

Advertisement
×