Anil Ravipudi: అనిల్ రావిపూడి టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించిన జనవరి 12 విడుదల (January 12 Vidudala )సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలంటే కామెడీ జోనర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. అయితే ఇకపై అనిల్ రావిపూడి ఈ కామెడీ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా కామెడీ జోనర్లో కాకుండా మైథాలజికల్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈయన తన డ్రీం ప్రాజెక్టు గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి తాజాగా గోవాలో జరిగిన 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి IFFI వేదికగా తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తాను తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పాలని భావిస్తున్నాను. విభిన్న జోనర్లలో సినిమాలు చేయాలన్నది నా కోరిక. అందుకే రామాయణం (Ramayana)ఆధారంగా ఓ యానిమేషన్ సినిమా (Animation Movie)చేయాలని భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఈయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అతి త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు. ఇలా అనిల్ రావిపూడి యానిమేషన్ గా రామాయణ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తన సినిమాలు ఎప్పుడు ఒకే జానెర్ లో కాకుండా విభిన్నమైన జోనర్లలో తనని తాను ఆవిష్కరించుకోవడానికి సిద్ధమైనట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇకపోతే ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా రామాయణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ అనిల్ రావిపూడి మరోసారి రామాయణం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అయితే యానిమేషన్ ద్వారా రూపొందించబోతున్నామని చెప్పడం గమనార్హం.
Also Read: బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?