Employee Fired: లంచ్ టైమ్‌లో కూడా డెస్క్ వద్దే కూర్చుని పని చేస్తున్న ఉద్యోగిపై ఓ కంపెనీ వేటు వేసింది. అయితే ఆఫీసు ముగిసే సమయం కంటే గంట ముందే ఆమె ఇంటికి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి ఉద్యోగికి కంపెనీ పంపిన మెయిల్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈమెయిల్ ప్రకారం.. సదరు ఉద్యోగి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉండే భోజన విరామాన్ని పదేపదే స్కిప్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో డెస్క్ వద్దనే కూర్చొని పనిచేసేవాడు. అయితే దానిని పనిగంటలకు ఆపాదిస్తూ.. సాయంత్రం 6 గంటలకు బదులుగా రోజూ 5 గంటలకే ఆఫీసు నుంచి వెళ్లడం ప్రారభించాడు
ఆ ఉద్యోగి తీరు మిగతా సిబ్బందిపై కూడా ప్రభావం చూపుతోందని కంపెనీ మెయిల్ లో పేర్కొంది. మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే పద్ధతిని పాటించడం మొదలుపెట్టారని ఆరోపించారు. లంచ్ సమయంలో బ్రేక్ తీసుకుకోండా పని పూర్తి చేసినంత మాత్రాన.. ఆఫీసు నిర్దేశించిన సమయం కంటే ముందుగా వెళ్లే హక్కు ఉద్యోగికి రాదని సదరు కంపెనీ స్పష్టం చేసింది.
Also Read: ‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!
కేటాయించిన పని పూర్తయిందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా ఆఫీసు నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందేనని యాజమాన్యం గుర్తు చేసింది. ‘ఈ ఆఫీసు మీ సొంతం కాదు. నిబంధనలు మేం రూపొందిస్తాం. మీరు వాటిని పాటించాలి’ అంటూ ఘాటుగా ఉద్యోగికి తెలియజేసింది. వెంటనే ఉద్యోగి నుంచి వైదొలగాని ఆదేశించింది.
ఈమెయిల్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు హెచ్చరిక లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నుంచి తొలగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తొందరగా వెళ్లిపోతున్నందుకు ఒకసారి వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు. పని పూర్తయినా సరే నిర్ణీత సమయానికంటే ముందే ఆఫీసు నుంచి వెళ్లిపోవడం తప్పేనని అభిప్రాయపడ్డారు.
Also Read: గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం.. డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్ వెనుక అసలు కథ ఇదే!