E-Paper
Advertisement

Washing Machine: రూ. 1599కే పోర్టబుల్ వాషింగ్ మిషన్..మీ కష్టాలకు బాయ్ చెప్పండి..

Washing Machine: రూ. 1599కే పోర్టబుల్ వాషింగ్ మిషన్..మీ కష్టాలకు బాయ్ చెప్పండి..
Advertisement

Washing Machine: అనేక మంది బట్టలు పిండుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. డ్రెస్సులు వేసుకున్నంత ఈజీగా ఉతుక్కునేందుకు ఆసక్తి చూపించరు. ప్రధానంగా బ్యాచిలర్స్, చిన్న పిల్లల తల్లులు సహా పలువురు ఇలాగే ఫీలవుతుంటారు. ఇలాంటి వారి కోసం బడ్జెట్ ధరల్లో ఓ వాషింగ్ మిషన్ వచ్చేసింది. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏ ధరకు అందుబాటులో ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజువారి చిన్న బట్టల కోసం 0.8Kg పోర్టబుల్ మినీ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది. ఈ మినీ వాషింగ్ మిషన్ చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్, ట్రావెలర్లు లేదా చిన్న పిల్లల తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ మిషన్ కొనుగోలు చేయడానికి ముఖ్యమైన కారణాలు
-కంపాక్ట్ సైజ్ – బాత్‌రూమ్, బెడ్‌రూమ్, కిచెన్ లేదా టెర్రస్ ఎక్కడైనా ఉంచుకోవచ్చు.
-ఎనర్జీ సేవింగ్ – తక్కువ విద్యుత్ వినియోగంతో పని చేస్తుంది.
-వాటర్ కన్జర్వేషన్ – చాలా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పనితీరును అందిస్తుంది
-సులభంగా క్యారీ చేయొచ్చు – హ్యాండిల్‌తో మీరు ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు
-పరిమిత బడ్జెట్ – రూ.1599 లోపే అందుబాటులో ఉండటంతో అందరికీ ఎఫోర్డబుల్

Advertisement

ఈ వాషింగ్ మిషన్ ప్రయోజనాలు
-సులభంగా మోసుకెళ్లవచ్చు– ఫోల్డబుల్ డిజైన్‌తో ఎక్కడైనా తీసుకెళ్లడానికి అనువైనది
-సులభమైన వాషింగ్ – టాప్‌లోడింగ్ సిస్టమ్‌తో డ్రాప్ చేసి వాష్ చేయడం చాలా సులభం.
-చిన్న దుస్తులకు ప్రత్యేకం – బేబీ క్లోత్స్, ఇంటిమేట్స్, చిన్న దుస్తుల కోసం సరైన ఎంపిక
-స్పిన్ & డ్రై మోడ్– కేవలం వాషింగ్‌ మాత్రమే కాదు, డ్రైయింగ్ కూడా చేసుకోవచ్చు
-అతి తక్కువ ధర – కేవలం రూ. 1599 రూపాయలకే, ఎక్కువ ఖర్చు లేకుండా లభ్యం
-మీరు ట్రావెలింగ్ కోసం లేదా చిన్న చిన్న దుస్తుల కోసం వాషింగ్ మిషన్ కోరుకుంటే, ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు

Read Also: Gold Bonds: తెలివైన పెట్టుబడి సవరిన్ గోల్డ్ బాండ్స్..8 ఏళ్లలో …

Advertisement

ఎవరికి ఉపయోగపడుతుంది?
-బ్యాచిలర్స్ – హోస్టల్స్ లేదా అద్దె ఇంట్లో ఉన్న వాళ్లకు ఇది బాగా పనికొస్తుంది.
-చిన్న పిల్లల తల్లిదండ్రులు – బేబీ క్లోత్స్ తరచుగా ఉతకాల్సి వస్తుంది. కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది.
-ట్రావెలర్స్ – క్యాంపింగ్, లాంగ్ ట్రిప్స్, బిజినెస్ టూర్స్ చేసే వారికి సరైన చాయిస్.
-చిన్న ఇళ్లలో పెద్ద వాషింగ్ మిషన్ పెట్టడానికి అవకాశం లేకపోతే, ఇది బెస్ట్.

దీనిని ఉపయోగించే విధానం?
-ముందుగా పోర్టబుల్ బకెట్‌ను ఓపెన్ చేయాలి
-నీళ్లు పోసి, సబ్బు లేదా డిటర్జెంట్ వేసి దుస్తులు పెట్టాలి
-ఆ తర్వాత వాష్ మోడ్‌ను ఎంచుకుని ఆన్ చేయాలి
-కొన్ని నిమిషాల తర్వాత నీళ్లు వదిలి, స్పిన్ మోడ్‌లో డ్రై చేయండి
-అంతే! మీ పనిని కేవలం 10-15 నిమిషాల్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

కొనుగోలు చేయడం ఎక్కడ?
మీరు ఈ పోర్టబుల్ మినీ వాషింగ్ మిషన్‌ని ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు, కొన్ని స్థానిక ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో కూడా ఇది లభిస్తుంది. కొంతమంది రిటైలర్లు దీన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో కూడా అందిస్తున్నారు.

ఇది పెద్ద కుటుంబాలకు మాత్రం సరిపోదు. మోటార్ పవర్ తక్కువగా ఉండటంతో, హేవీ వాషింగ్‌కి అనుకూలంగా ఉండదు. చిన్నపాటి మిషన్ అయినా కూడా, మీ రోజువారీ వాషింగ్ పనులు ఈజీగా చేసుకోవచ్చు.

Tags

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×