Anchor Shilpa..ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి (Shilpa Chakravarthy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. అంతేకాదండోయ్ సినిమాలలో కూడా నటించి, తన నటనతో ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరపై సుమా కనకాల (Suma kanakala) లాంటి స్టార్ యాంకర్స్ కి కూడా ఒక టైం లో పోటీగా నిలిచింది. ఇక అందరిలాగే ఈమె కూడా వివాహం చేసుకొని, పిల్లలు పుట్టాక కొన్నాళ్లు టీవీ షోలకు దూరంగా ఉంది. ఇక అంతా సెట్ అయింది సినిమాలలోకి అడుగుపెడదాము అని అనుకునే సమయంలోనే.. బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశమే ఆమె పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. హౌస్ లో చాలా సెన్సిటివ్ గా ఉన్న శిల్పా చక్రవర్తిని కొంతమంది పని కట్టుకొని మరి టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోల్స్ చేశారు.ఇక ఆ ట్రోల్స్ ఎంతలా వచ్చాయి అంటే ఒక మనిషిని ఇంతలా వేదిస్తారా అనే అనుమానాలు కూడా నెటిజెన్స్ కి కలిగాయి అంటే ఇక ఆమె ఎంత నరకం అనుభవించిందో ఒక మనిషిగా మనం కూడా ఊహించవచ్చు. ఆ బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఎక్కడ శిల్పా కనిపించలేదు.. దీంతో కంగారు పడిపోయిన అభిమానులు.. శిల్ప చక్రవర్తి ఏమైంది? ఎక్కడున్నారు? అసలు ఆమె ఎందుకు మళ్లీ సినిమాలలో నటించడం లేదు? కనీసం బుల్లితెరపై షోలు అయినా చేయాల్సింది కదా.. అంటూ పలు ప్రశ్నలు గుప్పిస్తున్న వేళ.. తాజాగా శిల్పా చక్రవర్తికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బిగ్ బాస్ వల్లే ఏడేళ్ల నరకం అనుభవించాను.. శిల్పా
ఈ వీడియో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది? అనే విషయానికి వస్తే.. శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ.. “ఏడు సంవత్సరాలుగా ఎన్నో బాధలు పడ్డాను. పిల్లలు పుట్టాక ,వారికి సమయం ఇవ్వాలని ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చాను. సరిగా రీఎంట్రీ ఇద్దాం అనుకున్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 3 లో ఆఫర్ వచ్చింది. ఇక ఆ షో కి వెళ్లాను అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. నేను వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చినా.. బూతులతో మరింత దారుణంగా తిట్టేశారు. ఆ సమయంలో మా ఆయన కూడా షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని అన్నారు. దీనికి తోడు నేను ఏ వీడియో పెట్టినా సరే దాని కింద ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేసారు. ఒకప్పుడు యాంకర్ గా వేల మంది ముందు భయపడకుండా మాట్లాడిన నేను.. ట్రోల్స్ తర్వాత మాట రాలేదు. ఆ ట్రోల్స్ వల్లే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాని నుండి బయటపడడానికి సుమారుగా నాలుగు నెలల సమయం పట్టింది. నాకు తెలిసిన వాళ్లే నీకు అవకాశాలు రావట్లేదా? హౌస్ వైఫ్ గా మారిపోయావా? ఇక ఇంట్లోనే ఉంటావా? అంటూ ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Vijayashanti: అదే పట్టుదల.. అదే పౌరుషం.. ఎన్టీఆర్ మనవళ్ళపై లేడీ అమితాబ్ కామెంట్..!
అయినవాళ్లే సూటిపోటి మాటలతో నరకం చూపించారు – శిల్పా..
అదే కరోనా సమయంలో మా ఆయన బిజినెస్ ఆగిపోవడం, హాస్పిటల్ బెడ్ మీద మా నాన్న మరణించడం, అదే సమయంలో అమ్మకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్.. ఇవన్నీ కూడా నన్ను మనిషిని చేయలేకపోయాయి. అయినా వారి బాధలు కష్టాలు నన్ను మరింత డిప్రెషన్ లోకి తోసేసాయి. ఇక ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. మా ఆయన బిజినెస్ కూడా మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా బంధువులే నన్ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టి, నాకు నరకం ఏంటో చూపించారు. అలా ఏడు సంవత్సరాలుగా నరకం అనుభవించిన నేను.. ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే సీరియల్స్, టీవీ షోలు చేస్తూ బిజీ అవుతాను” అంటూ శిల్పా చక్రవర్తి తెలిపింది. మొత్తానికి అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.