BigTV English

Gold Bonds: తెలివైన పెట్టుబడి, సావరిన్ గోల్డ్ బాండ్స్..8 ఏళ్లలో రూ.7 లక్షల లాభం..!

Gold Bonds: తెలివైన పెట్టుబడి, సావరిన్ గోల్డ్ బాండ్స్..8 ఏళ్లలో రూ.7 లక్షల లాభం..!

Gold Bonds: దేశంలో అనేక మంది భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి సేవ్ చేయడం లేదా దాచుకోవడం వంటివి చేస్తారు. కానీ భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమై సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) తీసుకుంటే మాత్రం మీరు దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. అవును మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో మీరు 10 లక్షల గోల్డ్ తీసుకుంటే, మరో 7 లక్షల లాభం వస్తుంది. దీర్ఘకాలంలో ఉంచితే దాదాపు మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. ఈ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భద్రతతోపాటు లాభం సహా అనేక పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి.


SGB అంటే ఏమిటి?
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) అనేది భారత ప్రభుత్వ పథకం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా జారీ చేయబడుతుంది. భౌతికంగా బంగారం కొని ఇంట్లో దాచుకోవడం కన్నా, మీరు బంగారాన్ని డిజిటల్ గోల్డ్‌గా బాండ్స్ రూపంలో తీసుకుని పెట్టుబడి పెట్టడం సురక్షితం, లాభదాయకంగా ఉంటుంది.

SGB ఎలా పని చేస్తుంది?
SGBలో పెట్టుబడి పెడితే, ఇది రెండు రకాల లాభాలను ఇస్తుంది. సంవత్సరానికి 2.5% వడ్డీ మీకు లభిస్తుంది. ఇది ప్రతి ఆరు నెలలకు మీ అకౌంట్‌లో జమ అవుతుంది. బంగారం ధర పెరిగితే మీకు అదనపు లాభం వస్తుంది. బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంది. కాబట్టి దీని వల్ల మీరు దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు.


పెట్టుబడి ప్రారంభం – కనీసం 1 గ్రాము బంగారం విలువతో (సుమారు రూ. 6,000) ప్రారంభించవచ్చు
వ్యవధి – 8 సంవత్సరాల బాండ్, కానీ 5వ ఏడాది తర్వాత వీటిని విక్రయించుకోవచ్చు

Read Also: Silver Investment: వెండి రాబడులు చూస్తే షాక్ అవ్వాల్సిందే .

ఉదాహరణకు: మీరు రూ. 10,00,000 విలువైన SGB కొనుగోలు చేస్తే, సంవత్సరానికి మీరు రూ.25,000 వడ్డీ (2.5%) పొందుతారు. SGB మెచ్యూరిటీ (8 ఏళ్ల తర్వాత) అయినప్పుడు, బంగారం మార్కెట్ రేటు ప్రకారం మీ పెట్టుబడి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ధర కంటే బంగారం రేటు ఎక్కువగా ఉంటే, మీకు అదనపు లాభం వస్తుంది. 8 ఏళ్లలో బంగారం ధర 50% పెరిగితే, మీ అసలు పెట్టుబడి రూ. 15,00,000 అవుతుంది. అంటే ఈ 8 ఏళ్లలో మీరు వడ్డీ ద్వారా రూ. 2,00,000 (రూ.25,000 × 8) పొందుతారు.

వడ్డీ ఆదాయం + పెరిగిన బంగారం విలువ లాభం = మొత్తం లాభం
రూ.2,00,000 + రూ.5,00,000 = రూ.7,00,000 లాభం

SGB కొనుగోలు ఎలా చేయాలి?
SGBలను మీరు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE/BSE), ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ. 50 తక్కువ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్యాంక్ బ్రాంచ్, పోస్ట్ ఆఫీస్, లేదా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్ ద్వారా పొందవచ్చు.

SGB పెట్టుబడి ప్రయోజనాలు
-బంగారం కొనడం వల్ల దొంగతనం, నకిలీ బంగారం వంట సమస్యలు లేకుండా మీ పెట్టుబడి భద్రంగా ఉంటుంది
-మీరు దీన్ని డీమాట్ ఫార్మాట్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు
-8 సంవత్సరాల తర్వాత ఈ బాండ్ విక్రయించినా కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు
-బంగారం ఎప్పుడూ దీర్ఘకాల పెట్టుబడికి మంచి ఎంపికగా ఉంటుంది
-గత 10–20 ఏళ్ల గోల్డ్ రేట్స్ చూస్తే 12-15% వరకు పెరిగాయి
-ఇది ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల) నుంచి రక్షణ అందిస్తుంది
-భద్రత & స్థిరమైన ఆదాయం కోరేవారికి బ్యాంక్ FD కన్నా ఎక్కువ వడ్డీ & భద్రత కావాలనుకునే వారికి ఇది బెస్ట్

Tags

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×