E-Paper
Advertisement

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!
Advertisement

Post Office Time Deposit: రోజురోజుకూ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో డబ్బులు దాచుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని సరైన చోట పెట్టి పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఇప్పటికీ బ్యాంకుల్లోనే డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్లు చేస్తుంటారు. అయితే, వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్న ‘పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్’ (POTD) పథకం కూడా మంచి లాభాలను ఇస్తోంది. దీన్ని చాలా మంది పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ అని కూడా పిలుస్తారు. ఎలాంటి షేర్ మార్కెట్ టెన్షన్లు లేకుండా, ప్రశాంతంగా స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్.

ఏ సంవత్సరానికి ఎంత వడ్డీ ?

Advertisement

మనం ఎంచుకునే కాలాన్ని (టెన్యూర్) బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లు..

1 సంవత్సరం డిపాజిట్: 6.9% వడ్డీ

Advertisement

2 సంవత్సరాల డిపాజిట్: 7.0% వడ్డీ

3 సంవత్సరాల డిపాజిట్: 7.1% వడ్డీ

5 సంవత్సరాల డిపాజిట్: 7.5% వడ్డీ (అన్నింటికంటే ఇదే ఎక్కువ!)

రూ. లక్ష పెట్టుబడి పెడితే చేతికి ఎంతొస్తాయి?

ఒకవేళ మీరు ఈ పథకంలో ఒకేసారి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) డిపాజిట్ చేస్తే, గడువు ముగిసేసరికి చేతికి వచ్చే మొత్తం సుమారుగా ఇలా ఉంటుంది.

1 సంవత్సరానికి: 6.9% వడ్డీ లెక్కన సుమారు రూ. 7,081 వడ్డీ రూపంలో వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 1,07,081 మీ అకౌంట్‌లో జమ అవుతాయి.

2 సంవత్సరాలకు: 7% వడ్డీ లెక్కన దాదాపు రూ. 14,888 వడ్డీ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ మొత్తం రూ. 1,14,888 అవుతుంది.

3 సంవత్సరాలకు: 7.1% వడ్డీ ప్రకారం సుమారు రూ. 23,508 వడ్డీ లభిస్తుంది. మొత్తంగా రూ. 1,23,508 వరకు అందుకోవచ్చు.

5 సంవత్సరాలకు: అత్యధికంగా 7.5% వడ్డీ దక్కడం వల్ల, దాదాపు రూ. 44,995 వడ్డీ రూపంలోనే అదనంగా వస్తుంది. అంటే గడువు తీరే సరికి మీ చేతికి ఏకంగా రూ. 1,44,995 అందుతాయి!

ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయా?

ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అయితే.. ఈ వెసులు బాటు కేవలం పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. అలాగే, దీనిపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ పడుతుంది కాబట్టి.. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ స్కీమ్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పెట్టుబడి పెట్టే ముందు కొన్ని  చిట్కాలు:

అవసరాలను బట్టి గడువు ఎంచుకోండి: రేపు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఖర్చుల కోసం డబ్బు అవసరపడొచ్చు అనుకుంటే.. ఆ మొత్తాన్ని 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌లో పెట్టకపోవడమే మంచిది.

ముందస్తు విత్‌డ్రా: ఒకవేళ గడువు తీరకుండానే.. మధ్యలో డబ్బు వెనక్కి తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. దీని వల్ల వడ్డీ కాస్త తగ్గే అవకాశం ఉంది.

కాబట్టి.. మీ కుటుంబ అవసరాలు, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఎంత డిపాజిట్ చేయాలో నిర్ణయించుకోండి. అలాగే.. ఇన్వెస్ట్ చేసే ముందు మీ దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌లో లేదా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌ సైట్‌లో ఒక సారి లేటెస్ట్  వివరాలు కనుక్కోవడం చాలా మంచిది.

Related News

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

అరటి వ్యర్థాలతో కోట్ల బిజినెస్.. ఎంబిఏ గ్రాడుయేట్ల ఐడియా అదుర్స్

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

Big Stories

Advertisement
×