E-Paper
Advertisement

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!
Advertisement

Gen Z Business Ideas: జనరేషన్‌ జెడ్‌ (Gen-Z) కేవలం ఉద్యోగాల వైపే కాకుండా స్వయం ఉపాధి, స్టార్టప్‌ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకున్న చిన్న చిన్న అభిరుచులు, సాంకేతిక నైపుణ్యాలను లాభసాటి వ్యాపారాలుగా మలచుకోవడానికి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ నైపుణ్యాలతోనే వ్యాపారంలో రాణించేందుకు ఈ రోజుల్లో మెండుగా అవకాశాలు ఉన్నాయి. అలాంటి 6 బెస్ట్ బిజినెస్ ఐడియాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

షార్ట్ వీడియో ప్రొడక్షన్

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, హవా నడుస్తోంది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద బ్రాండ్ల వరకు అందరూ తమ ఉత్పత్తులను జనాలకు చేరవేయడానికి రీల్స్ ను ఓ అవకాశంగా చూస్తున్నారు. కాబట్టి వీడియో ఎడిటింగ్, ట్రెండింగ్ మ్యూజిక్ సెన్సింగ్, కంటెంట్ క్రియేషన్‌లో నైపుణ్యం ఉన్న Gen-Z యువత ఈ రంగంలోకి సులభంగా అడుగుపెట్టి మంచి ఆదాయం పొందేందుకు వీలుంది.

యాప్ డెవలప్‌మెంట్

Advertisement

స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన తరుణంలో మొబైల్ అప్లికేషన్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. కోడింగ్ లేదా బేసిక్ సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలున్న యువత.. స్థానిక వ్యాపారులు, రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ సెంటర్ల కోసం కస్టమైజ్డ్ యాప్‌లను తయారు చేసి అందించడం ద్వారా మంచి స్టార్టప్‌ను ప్రారంభించవచ్చు.

కాలేజ్ మూవింగ్ అండ్ ప్యాకింగ్

విద్యాసంవత్సరం మొదలైనప్పుడు, ముగిసినప్పుడు విద్యార్థులు తరుచూ హాస్టళ్లు, అపార్ట్ మెంట్లకు మారుతుంటారు. ఈ సమయంలో సామాగ్రిని ప్యాక్ చేయడం, ఒక చోటి నుంచి మరో చోటికి రవాణా చేయడం వారికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ నేపథ్యంలో మినీ ట్రక్కులు, రవాణా సదుపాయాలను సమన్వయం చేస్తూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘కాలేజ్ మూవింగ్’ సర్వీస్‌ను ఏర్పాటు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

పెంపుడు జంతువుల కేరింగ్

Advertisement

ఇంట్లో పెంపుడు జంతువులను (కుక్కలు, పిల్లులు) సొంత పిల్లల్లా చూసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యజమానులు.. ఉద్యోగాలు, ప్రయాణాల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు వారి పెంపుడు జంతువులను చూసుకోవడం, వాకింగ్ తీసుకెళ్లడం, గ్రూమింగ్ చేయడం వంటి సేవలకు భారీ డిమాండ్ ఉంది. కాబట్టి పెట్ లవర్స్ దీన్ని అద్భుతమైన బిజినెస్ ఐడియాగా మలచుకోవచ్చు.

హోమ్ సర్వీసెస్

ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు, ఎలక్ట్రికల్ పనులు, క్లీనింగ్, గార్డెనింగ్ వంటి పనుల కోసం నమ్మకమైన వ్యక్తులు దొరకడం ఈ రోజుల్లో కష్టంగా మారుతోంది. టెక్నాలజీని ఉపయోగించి స్థానిక నిపుణులను, కస్టమర్లను అనుసంధానించే ఒక చిన్న ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపొచ్చు. తద్వారా మంచి వ్యాపారం చేయవచ్చు.

Also Read: ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

సోషల్ మీడియా కన్సల్టింగ్

ఈ రోజుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ Gen-Z యువతకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, సెలూన్‌లు సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి వారికి ప్రొఫైల్ మేనేజ్‌మెంట్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యూహాలను అందిస్తూ ‘సోషల్ మీడియా కన్సల్టెంట్’గా కెరీర్ ప్రారంభించి రాణించవచ్చు.

Also Read: జబర్దస్త్ నుండి బలవంతంగా పంపించేశారు: ధనరాజ్!

Tags

Related News

అరటి వ్యర్థాలతో కోట్ల బిజినెస్.. ఎంబిఏ గ్రాడుయేట్ల ఐడియా అదుర్స్

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

బంగారం కొనుగోళ్లలో కొత్త ట్రెండ్.. ధరలు పెరుగుతున్నా నగలు కొంటున్న ప్రజలు.. కానీ

ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?

పోస్టాఫీస్ RD vs SBI RD.. పదేళ్ల పాటు నెలకు రూ.10,000 పొదుపు చేస్తే ఏది బెటర్?

Big Stories

Advertisement
×