E-Paper
Advertisement

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!
Advertisement

Taruwar Agro: సాధారణంగా స్నేహితులు కలిస్తే సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం, పార్టీల పేరుతో ఎంజాయ్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ బిహార్ కు చెందిన ముగ్గురు స్నేహితులు మాత్రం.. ఓ విచిత్రమైన వ్యాపారాన్ని ప్రారంభించి అందులో సక్సెస్ అయ్యారు. అరటి తోటల్లో మిగిలిన వ్యర్థాలను తమ వ్యాపారానికి ముడిసరుకుగా మార్చుకొని సక్సెస్ అయ్యారు. యోగా మ్యాట్లు, ఫైల్ ఫోల్డర్లు, బుట్టలు వంటి ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారుచేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్మించారు.

ఎంబీఏ కాలేజీలో పరిచయం..

జగత్ కల్యాణ్, సత్యం కుమార్, నితీశ్ కుమార్ వర్మ అనే ముగ్గురు ఎంబీఏ చదువుతున్న రోజుల్లో ఒకరికొకరు పరిచయమే మంచి స్నేహితులుగా మారారు. ఎంబీఏ తర్వాత జగత్ కల్యాణ్‌కు టాంజానియా, దుబాయ్ వంటి దేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లతో పాటు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. నితీశ్ కు ఇన్ఫోసిస్, ఎస్ & పీ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇక సత్యం కుమార్ ఎకనామిక్స్‌ పూర్తి చేసి.. పర్యావరణ ఆధారిత సంస్థల్లో పనిచేశారు.

మంచి ఉద్యోగాలు ఉన్నా..

Advertisement

చేతిలో మంచి జాబ్స్, విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉన్నప్పటికీ.. కరోనా సమయంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతరుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునేకంటే.. సొంత రాష్ట్రంలోనే ఏదైనా స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించాలని నిశ్చయించుకున్నారు. అలా 2021లో ‘తరువర్ ఆక్రో’ (Taruwar Agro) సంస్థకు శ్రీకారం చుట్టారు.

అరటి వ్యర్థాలే ముడిసరుకుగా..

వ్యవసాయ రంగంలో వినూత్నంగా ఏదైనా చేయాలని భావించిన ఈ ముగ్గురు మిత్రులు.. ప్రధానంగా అరటి సాగుపై దృష్టి సారించారు. సాధారణంగా గెలలు కోసిన తర్వాత అరటి కాండాలు రైతులకు వ్యర్థాలుగా మిగిలిపోతాయి. ఆ కాండాల నుంచి నార (ఫైబర్) తీయవచ్చని గుర్తించిన ఈ మిత్రులు.. రైతుల వద్ద నుంచి వాటిని కొనుగోలు చేసి, ప్రత్యేక యంత్రాల ద్వారా నారను వేరుచేయడం ప్రారంభించారు.

అనేక రకాల ఉత్పత్తులు

Advertisement

అరటి నారతో ఫైల్ ఫోల్డర్లు, యోగా మ్యాట్లు, ప్రార్థన మ్యాట్లు, బుట్టలు తయారు చేయడం మెుదలుపెట్టారు. అంతేకాకుండా నార తీయగా మిగిలిన గుజ్జును వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు)గా మార్చారు. అలాగే కాండం నుంచి వచ్చిన ద్రవం నుంచి మెుక్కలకు అవసరమైన పోషకాల తయారీకి ఉపయోగించారు. ఇలా అరటి చెట్టులోని ప్రతి భాగాన్నీ ఆదాయ వనరుగా మార్చుకొని ఈ స్నేహితులు అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ప్రస్తుతం వీరు ‘విగాన్ లెదర్’ (శాకాహార తోలు), బ్లెండెడ్ వస్త్రాల తయారీపై కూడా పరిశోధనలు చేస్తున్నారు.

రూ. 2.5 కోట్ల టర్నోవర్

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 15 లక్షల పెట్టుబడి, రూ. 5 లక్షల వర్కింగ్ క్యాపిటల్‌ను ముగ్గురు స్నేహితులు సమకూర్చుకున్నారు. ప్రారంభంలో నార తీసే విధానం, రవాణా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సమస్యలు ఎదురైనప్పటికీ.. స్థానికులకు శిక్షణ ఇచ్చి తయారీలో భాగస్వాములను చేశారు. ప్రస్తుతం వీరి సంస్థలో పనిచేస్తున్నవారిలో 60 శాతం మంది మహిళలే కావడం విశేషం. అరటితో పాటు వ్యవసాయ వ్యర్థాలతో మొదలైన ఈ వ్యాపారం.. 2026 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు రూ. 2.5 కోట్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.

Also Read: కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

గ్లోబల్ మార్కెట్ దిశగా అడుగులు

ప్రస్తుతం ‘తరువర్ ఆక్రో’ కంపెనీ నారను సరఫరా చేయడంతో పాటు సొంత వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ద్వారా ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తోంది. దీంతో పాటు బిహార్‌కే ప్రత్యేకమైన ‘మఖానా’ వ్యాపారంలోకి కూడా ప్రవేశించి 10కి పైగా ఫ్లేవర్లలో ముడి, వేయించిన మఖానాను విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు తమ నార ఉత్పత్తుల శాంపిల్స్ పంపి విదేశీ మార్కెట్లలోకి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read: చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

Tags

Related News

కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

అరటి వ్యర్థాలతో కోట్ల బిజినెస్.. ఎంబిఏ గ్రాడుయేట్ల ఐడియా అదుర్స్

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

బంగారం కొనుగోళ్లలో కొత్త ట్రెండ్.. ధరలు పెరుగుతున్నా నగలు కొంటున్న ప్రజలు.. కానీ

Big Stories

Advertisement
×