E-Paper
Advertisement

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!
Advertisement

ప్రస్తుతం గూగుల్‌లో విడాకుల కీవర్డ్ ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే చర్చ నడుస్తోంది. అయితే.. దాని గురించి చర్చిస్తే.. టాపిక్ వేరే వైపు వెళ్లిపోతుంది. కాబట్టి.. మనం కాసేపు దేశాన్ని వదిలి అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీ ఎన్‌విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ గురించి మాట్లాడుకుందాం. చైనాకు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆలీస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న జెన్సన్.. ఇటీవల కంపెనీ తమ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తన వైవాహిక జీవితంలో భార్యకు అన్యాయం చేసినట్లు ఒప్పకుంటూ.. క్షమాపణలు చెప్పారు.

ఈ నేపథ్యంలో జెన్సన్ త్వరలోనే తన భార్య లోరీ హువాంగ్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. అతని ఆస్తిలో సగం ఆమెకు రాసి ఇవ్వాల్సి వస్తుందని, లోరీకి సుమారు రూ.5 లక్షల కోట్లు పైగా భరణం ఇవ్వాల్సి వస్తుందని అంచనా. అదే జరిగితే.. చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలుస్తుంది. అయితే, విడాకుల ద్వారా భారీగా పరిహారం పొందడం కొత్తకాదు. కొంతమంది సెలబ్రిటీల భార్యలు.. ఈ విధంగానే వేల కోట్లకు అధిపతి అయ్యారు. వారెవ్వరో చూసేద్దామా!

జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్

Advertisement

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకెంజీ 25 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోయారు. విడాకుల ఒప్పందంలో భాగంగా అమెజాన్‌లో 4 శాతం వాటాను మెకెంజీకి ఇచ్చారు. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. బెజోస్ నుంచి ఆమెకు సుమారు రూ.3.16 లక్షల కోట్లు లభించినట్లు సమాచారం.

బిల్ గేట్స్ – మెలిండా ఫ్రెంచ్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్‌ కూడా విడాకుల రూపంలో భారీ భరణం చెల్లించాల్సి వచ్చింది. 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆయన తన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌‌కు విడాకులు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఆర్ట్ కలెక్షన్ల రూపంలో సుమారు రూ.6.3 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను ఆమె భరణంగా పొందింది.

అలెక్ వైల్డెన్‌స్టీన్, జోస్లిన్ వైల్డెన్‌స్టీన్

Advertisement

ప్రముఖ ఫ్రెంచ్ ఆర్ట్ డీలర్ అలెక్ తన భార్య జోస్లిన్‌కు భరణం కింద ఒకేసారి 2.5 బిలియన్ డాలర్లు (భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ.21,000 కోట్లు) చెల్లించాడు. ఆ తర్వాత 13 ఏళ్ల పాటు మరో 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.940 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అంటే సుమారు రూ.30,000 కోట్లు వరకు భరణం చెల్లించాడు.

రూపర్ట్ ముర్డోచ్, అన్నా టోర్వ్

మీడియా మోఘల్ రూపర్ట్ ముర్డోచ్ 32 ఏళ్ల పెళ్లి బంధానికి స్వస్తి పలికి.. తన రెండో భార్య అన్నా టోర్వ్‌కు విడాకులిచ్చాడు. ఇందుకు పరిహారంగా సుమారు 1.7 బిలియన్ డాలర్లు (భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ.14 వేల కోట్లు) చెల్లించాడు.

మెల్ గిబ్సన్ – రాబిన్ మూర్

ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ తన 31 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ తన భార్య రాబిన్ మూర్‌కు విడాకులిచ్చాడు. ఇందుకు పరిహారంగా సుమారు 435 మిలియన్ డాలర్లు ఇచ్చాడు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.3,500 కోట్లు. హలీవుడ్ చరిత్రలోనే ఇది అత్యధిక విడాకుల భరణం.

స్టీవెన్ స్పిల్‌బర్గ్ – అమీ ఇర్వింగ్

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైతం భారీగా భరణం చెల్లించక తప్పలేదు. హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన, సంచలన విడాకుల కేసు ఈయనదే. స్పీ‌ల్‌బర్గ్ 1970లో అమీ ఇర్వింగ్‌‌తో డేటింగ్ మొదలుపెట్టారు. 1985లో ఆమెను పెళ్లాడారు. అప్పటికే ఆయన Jaws, Raiders of the Lost Ark, E.T. సినిమాలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దర్శకుల్లో ఒకరిగా పేరొందారు. అయితే, పెళ్లికి ముందు వీరు ఇద్దరి ఆస్తుల రక్షణ కోసం ఒక ప్రి-నప్ (పెళ్లికి ముందు రాసుకొనే ఆస్తుల ఒప్పందం) రాసుకోవాలని భావించారు. ఆ సమయంలో వారి దగ్గర ఎలాంటి అధికారిక న్యాయపత్రాలు లేవు. దీంతో స్పిల్‌బర్గ్ వాళ్లు కూర్చున్న రెస్టారెంట్‌లో ఉన్న నేప్‌కిన్ పేపరు (టిష్యూ) మీదే షరతులు రాశారు.

Also Read: ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

ఆ తర్వాత దానిపై ఇరువురు సంతకాలు చేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. అయితే పెళ్లయిన మూడేళ్లకే వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల సమయంలో స్పీల్‌బర్గ్ ఆ నేప్‌కిన్ పేపర్‌‌ను కోర్టుకు చూపించారు. దాని ప్రకారమే ఆస్తి పంపిణీ జరగాలని కోరారు. అయితే, కాలిఫోర్నియా కోర్టు ఆ నేప్‌కిన్ ప్రీ-నప్ అగ్రీమెంట్ చెల్లదన్నారు. దీంతో భరణంగా ఆయన ఆస్తిలో సగం వాటా ఆమెకు ఇవ్వక తప్పలేదు. అప్పట్లోనే ఆయన 100 మిలియన్ డాలర్లు (రూ.830 కోట్లు) విలువ చేసే ఆస్తులను పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది.

Tags

Related News

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

అరటి వ్యర్థాలతో కోట్ల బిజినెస్.. ఎంబిఏ గ్రాడుయేట్ల ఐడియా అదుర్స్

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

Big Stories

Advertisement
×