Mahabubabad Accident: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు బైక్‌ను దారుణంగా ఢీకొట్టడంతో, ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన దంపతులు
మరిపెడ మండలం లచ్య తండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులను లచ్య తండాకు చెందిన బానోత్ సామా (50), పద్మా (40)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే తండావాసులు ప్రమాద స్థలానికి చేరుకుని, దంపతుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్య తండా సమీపంలో కారు, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను లచ్య తండాకు చెందిన బానోత్ సామా, పద్మలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం… pic.twitter.com/S2s09iTiUj
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2026
పోలీసుల దర్యాప్తు శరవేగం
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్