Student Startup Story: సాధారణంగా కాలేజీ విద్యార్థులంటే పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. లెక్చరర్లు ఇచ్చే అసైన్ మెంట్లు, ప్రాజెక్టులు, సెమిస్టర్ పరీక్షలంటూ నిత్యం చదువులో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ గురుగ్రామ్ కు చెందిన 21 ఏళ్ల యువతి అనన్య అగర్వాల్ మాత్రం.. చదువుతో పాటు వ్యాపారంలోనూ విశేషంగా రాణిస్తున్నారు. స్టూడెంట్ గా ఉండగానే కెఫేను ప్రారంభించిన ఆమె.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షల ఆదాయాన్ని అర్జించి ఆశ్చర్యపరిచారు. తన సక్సెస్ తో ఎంతో మంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గురుగ్రామ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న అనన్య అగర్వాల్ స్థానికంగా బిస్ట్రో అనే కెఫేను ప్రారంభించారు. ఇటాలియన్, మెక్సికన్ వంటకాలతో ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన కెఫే గురించి అనన్య మాట్లాడుతూ ‘దేశంలో ఇటాలియన్, మెక్సికన్ వంటకాలకు చాలా మంది భారతీయ మసాలాలు కలిపి ఘాటుగా తయారు చేస్తారు. దాంతో ఆ వంటకాల అసలైన రుచి మాయమవుతోంది. ఆ తప్పు మేం చేయడం లేదు. ఫారన్ వంటకాల్లో వాటి ఒరిజినల్ రుచి ఏమాత్రం మిస్ కాకుండా కస్టమర్లకు అందిస్తున్నాం’ అని వివరించారు.
అయితే అనన్య ఈ కెఫే ప్రయాణంలో ఒంటరిగా నడవలేదు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆమె తండ్రికి ఈ కెఫే బిజినెస్ లో దశాబ్దానికి పైగా వ్యాపార అనుభవం ఉంది. తల్లిదండ్రులతో కలిసి వ్యాపారంలోకి దిగడం వల్ల ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే.. వ్యాపారాన్ని చూసుకునే సౌలభ్యం తనకు దక్కింది. ఓవైపు కాలేజీలో క్లాసులకు అటెండ్ అవ్వడంతో పాటు.. సాయంత్ర వేళల్లో కెఫే బాధ్యతలను అనన్య సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
Also Read: చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!
రెస్టారెంట్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఆహార నాణ్యతను కాపాడటం, కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించడం వంటి ఎన్నో బాధ్యతలను అనన్య చదువుతో పాటు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి అనన్య మాట్లాడుతూ.. ‘నేను ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నా జీవితంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేదానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!