E-Paper
Advertisement

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు
Advertisement

Unemployment And Job market | ఐటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక్క ఇంటర్వ్యూ పిలుపు వచ్చినా ఎంతో సంతోషం కలుగుతుంది. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 55 ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అందులో 25 ఇంటర్వ్యూలు చివరి దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ ఒక్క ఉద్యోగ ఆఫర్ కూడా రాలేదు. 7 నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన తెలియజేస్తోంది.

175 ఉద్యోగాలకు దరఖాస్తు

ఉద్యోగం కోల్పోయిన ఈ వ్యక్తి 7 నెలలుగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో మొత్తం 175 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ సంస్థల నుంచి 55 ఇంటర్వ్యూ పిలుపులు అందుకున్నారు. వాటిలో 25 ఇంటర్వ్యూలు చివరి దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ ఏ సంస్థ కూడా ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాలేదు.
తన పరిస్థితిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ చాలా కఠినంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు అందుతున్న నిరుద్యోగ భృతి కూడా పూర్తిగా అయిపోయిందని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు రోజువారీ ఖర్చులపై కూడా ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. గతంలో క్రమం తప్పకుండా కొనుగోలు చేసే ప్రోటీన్ డ్రింక్ కూడా ఇప్పుడు కొనలేకపోతున్నానని వెల్లడించారు. 12 బాటిళ్ల ప్యాక్ ధర గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

ఏఐ సాయం కోసం ఉద్యోగ అన్వేషణ

Advertisement

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు ఆ వ్యక్తి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌ను రూపొందించారు. తన రెజ్యూమ్, గత అనుభవాలు, నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలను గుర్తించేలా దాన్ని ఉపయోగిస్తున్నారు.
దీంతో సంబంధం లేని ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా అర్హతలకు సరిపోయే అవకాశాలపై దృష్టి పెట్టగలుగుతున్నారు. తనకు 95 శాతానికి పైగా సరిపోయే ఉద్యోగాలనే ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగం దక్కకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని వారాల్లోనైనా ఉద్యోగ అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Also Read: రైల్వే స్టేషన్‌లో కూలీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి

తమ ఉద్యోగ అనుభవాలు షేర్ చేసిన నెటిజన్లు 

Advertisement

ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ తమ అనుభవాలను వివరించారు. ఒకరు నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్ రౌండ్‌లో చివరి ముగ్గురు అభ్యర్థుల్లో స్థానం దక్కిందన్నారు. మరో వ్యక్తి ఫిబ్రవరిలో ఉద్యోగం కోల్పోయి, ఆగస్టులో కొత్త ఉద్యోగం సంపాదించినట్లు తెలిపారు. ఇంకొందరు 25 ఇంటర్వ్యూలు చివరి దశకు చేరుకోవడం అభ్యర్థి సామర్థ్యాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు.
కొన్ని కంపెనీలు అంతర్గతంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చని ఒకరు వివరించారు. మరికొందరు ఇంటర్వ్యూలలో తమ నైపుణ్యాలను స్పష్టంగా వివరించేలా ప్రాక్టీస్ చేయాలని సూచించారు.

Also Read: టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏళ్ల బాలుడు.. పోలీసులు రాగానే మరింత తెగించి

ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఆశ కోల్పోకూడదు

ఈ ఘటన ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లోని అనిశ్చితిని బయటపెడుతోంది. అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ ఉద్యోగం దక్కడం కష్టంగా మారుతోంది. వరుసగా తిరస్కరణలు ఎదురైనా ప్రయత్నాలు కొనసాగించాలని పలువురు సూచిస్తున్నారు.

Related News

ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

బంగారం కొనుగోళ్లలో కొత్త ట్రెండ్.. ధరలు పెరుగుతున్నా నగలు కొంటున్న ప్రజలు.. కానీ

ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?

పోస్టాఫీస్ RD vs SBI RD.. పదేళ్ల పాటు నెలకు రూ.10,000 పొదుపు చేస్తే ఏది బెటర్?

వస్త్ర వ్యాపారి గొప్ప మనసు.. దీపావళి కానుకగా ఉద్యోగులకు నోట్ల కట్టలు.. వీడియో వైరల్!

ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు

దీపావళి వేళ రికార్డు స్థాయి వ్యాపారం.. కేవలం ఢిల్లీలోనే రూ.లక్షల కోట్లకుపైగా.. దేశవ్యాప్తంగా ఎంతంటే

Big Stories

Advertisement
×