E-Paper
Advertisement

బిజీ కపుల్స్ కోసం టాప్ 5.. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!

బిజీ కపుల్స్ కోసం టాప్ 5.. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!
Advertisement

Fully automatic washing machines: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగాలు చేసే భార్యాభర్తలకు ఇంటి పనులు చేయడం ఒక పెద్ద సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా ఆఫీసు హడావుడిలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం అంటే కత్తి మీద సామే. ఈ టెన్షన్‌ను పూర్తిగా తగ్గించడానికి మార్కెట్లోకి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు వచ్చేశాయి. ఒక్క టచ్‌తో బట్టలు ఉతికి, ఆరబెట్టి ఇచ్చే ఈ స్మార్ట్ అప్లయన్సెస్ బిజీ కపుల్స్ లైఫ్‌ను ఎంతగా ఈజీ చేస్తాయో చూసేద్దామా..

1. Bosch 8 Kg  Washing Machine (WTG8640SIN):

మొదటి ఆప్షన్‌గా బాష్ సంస్థకు చెందిన 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ డ్రయర్ వాషింగ్ మెషీన్ మార్కెట్లో దాదాపు రూ. 44,990 ధరకు లభిస్తుంది. ఇది చిన్న కుటుంబాలకు , బిజీ జంటలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో ఉండే బెస్ట్ కండెన్సర్ డ్రై టెక్నాలజీ వల్ల వర్షాకాలంలోనూ బట్టలు క్షణాల్లో వంద శాతం ఆరిపోతాయి. అలాగే బట్టల కోసం ప్రత్యేకమైన ఊల్ వాష్ ప్రోగ్రామ్, ఇన్‌బిల్ట్ హీటర్ దీని ప్రత్యేకత.

2. LG 9 Kg  Washing Machine :

Advertisement

రెండో ఆప్షన్‌గా ఎల్జీ సంస్థకు చెందిన 9 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ డ్రయర్ వాషింగ్ మెషీన్ దాదాపు రూ. 69,490 ధరతో హై-ఎండ్ మోడల్‌గా అందుబాటులో ఉంది. ఇది ఐదు స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉండి, ఏఐ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో బట్టల స్వభావాన్ని బట్టి వాషింగ్ మోడ్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. దీనిలోని కండెన్సర్ డ్రై సిస్టమ్ వల్ల బట్టలు ముడతలు పడకుండా మెత్తగా వస్తాయి. వైఫై కనెక్టివిటీ ఉండటంతో ఆఫీసులో ఉంటూనే స్మార్ట్‌ ఫోన్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు.

3. Bosch 8 Kg Washing Machine:

మూడో ఆప్షన్‌గా మరో బాష్ 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ డ్రయర్ వాషింగ్ మెషీన్ సుమారు రూ. 50,990 ధరలో లభిస్తుంది. ఆటో డ్రై ఫంక్షన్‌తో వచ్చే ఈ మెషీన్ బట్టల్లోని తేమను పూర్తిగా తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది చాలా సైలెంట్‌గా రన్ అవుతుంది కాబట్టి ఆఫీసు వేళల్లో హడావుడి లేకుండా రాత్రి సమయంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఐదు స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు.

4. Electrolux 7.5 Kg Washing Machine :

Advertisement

నాలుగో ఆప్షన్‌గా ఎలక్ట్రోలక్స్ 7.5 కేజీ అల్టిమేట్ కేర్ మోడల్ దాదాపు రూ. 36,490 ధరకు లభిస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు, వర్కింగ్ కపుల్స్‌కు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. వెంటెడ్ డ్రై టెక్నాలజీ కారణంగా బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి. ఇందులో ఉండే క్విక్ వాష్ అండ్ డ్రై సైకిల్ తక్కువ సమయంలోనే.. రోజువారీ ఆఫీసు బట్టలను శుభ్రంగా ఉతికి, డ్రై చేసి అందిస్తుంది.

Also Read: విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

5. IFB 11/7 Kg Washer with Dryer :

ఐదో ఆప్షన్‌గా ఐఎఫ్‌బీ సంస్థకు చెందిన 11 లేదా 7 కేజీ ఏఐ పవర్డ్ వాషర్ విత్ డ్రయర్ కాంబో రూ. 55,000 నుంచి రూ. 60,000 మధ్య లభిస్తుంది. ఒకేసారి ఎక్కువ బట్టలు ఉతకాలనుకునే జంటల కోసం ఇది బెస్ట్ ఛాయిస్. ఏఐ ఆటో డిటర్జెంట్ డిస్పెన్సింగ్, ఆక్సిజెట్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. కేవలం ముప్పై నిమిషాల స్టీమ్ రిఫ్రెష్ ప్రోగ్రామ్ ద్వారా బట్టలపై ఉన్న బ్యాక్టీరియా పోవడంతో పాటు మంచి వాసన కూడా వస్తాయి.

ఇంటి పనుల ఒత్తిడిని తగ్గించుకుని,ప్రశాంతమైన వీకెండ్‌ను ఆస్వాదించాలనుకునే ప్రతి వర్కింగ్ కపుల్స్ ఇంటికి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ విత్ డ్రయర్ ఒక అద్భుతమైన వరం. ఇవి మీ సమయాన్ని, శ్రమను ఆదా చేయడమే కాకుండా మీ బట్టల నాణ్యతను కూడా కాపాడుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బడ్జెట్‌కు తగిన మోడల్‌ను ఎంచుకుని మీ లైఫ్‌ను ఈజీ చేసుకోండి!

Related News

తరచూ మిక్సర్ పాడైపోతుందా? ఈ మోడల్స్ కొంటే..ఆ టెన్షనే ఉండదు!

పొద్దుతిరుగుడు పువ్వు నిజంగానే సూర్యుడి వైపు తిరుగుతుందా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

Big Stories

Advertisement
×