Gold Rate Today: అయ్యయ్యో.. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుకుంటూ రావడంతో, సామాన్యులు అబ్బా.. ధరలు తగ్గుతున్నాయి, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని బంగారం కొనేయవచ్చు అని ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పసిడి దిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఈరోజు ఉదయం నుంచే బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా యు-టర్న్ తీసుకోవడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,900 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.770 పెరిగింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,720 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,750 వద్ద ఉంది.
సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. ఇదెక్కడి ట్విస్ట్.. నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న సిల్వర్ ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. నేటి ధరలు చూసుకుంటే.. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ.2,40,000 వద్ద పలుకుతోంది. అంటే నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగింది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద కొనసాగుతోంది.