E-Paper
Advertisement

ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ షాక్.. సైలెంట్‌గా ఆ కీలక సేవలు బంద్!

ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ షాక్.. సైలెంట్‌గా ఆ కీలక సేవలు బంద్!
Advertisement

LIC Payments: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ.. తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా ప్రీమియంలు చెల్లించే విధానంలో కీలకమార్పును తీసుకొచ్చింది. ఇన్నాళ్లు అందుబాటులో ఉన్న కీలక డిజిటల్ పేమేంట్ ను ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా తొలగించింది. ఎల్ఐసీ తీసుకున్న ఈ నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలపై ఆధారపడై లక్షలాది మంది పాలసీ దారులు ఇబ్బంది పడక తప్పని పరిస్థితులు తలెత్తాయి.

క్రెడిట్ కార్డ్ పేమెంట్ సేవలు

ఎల్ఐసీ తన పాలసీదారులు చేసే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రీమియం చెల్లింపుల విభాగంలో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనిపించడం లేదు. కేవలం నెట్ బ్యాకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ చెల్లింపులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం కట్టాలనుకునేవారికి, కార్డ్ రివార్డు పాయింట్లు పెంచుకోవాలని భావించేవారికి.. ఈ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

సేవలు నిలిపివేతకు కారణమేంటి?

Advertisement

ఎల్ఐసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదం దాగి ఉన్నట్లు సమాచారం. ఎల్ఐసీకి ఆన్‌లైన్ లావాదేవీల సేవలను అందిస్తున్న ‘బిల్ డెస్క్’ (Bill Desk) గేట్‌వే, క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై వసూలు చేసే సేవా రుసుములకు (Convenience Fees) సంబంధించి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఉండే అదనపు రుసుములను కస్టమర్లపై భారం పడకుండా ఎల్ఐసీ సంస్థే భరిస్తూ వచ్చింది. అయితే ఈ ఛార్జీల భారం ఎక్కువ కావడం, గేట్‌వే నిర్వాహకులతో కుదిరిన ఒప్పందంలో మార్పులు రావడంతో క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను తాత్కాలికంగా తొలగించినట్లు తెలుస్తోంది.

కస్టమర్లకు ప్రత్యామ్నాయాలు ఏంటి?

ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పని చేయకపోయినప్పటికీ పాలసీదారులు తమ ప్రీమియంలను చెల్లించేందుకు మిగిలిన మార్గాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఎల్ఐసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఐడీ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. లేదంటే నేరుగా ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులు, ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా ప్రీమియంలు కట్టవచ్చు.

Advertisement

Also Read: ఫోన్లు, టీవీల వెనుక ఉండే.. ‘CE’ గుర్తు అర్థమేంటి? దాని రహస్యం ఇదే!

త్వరలోనే పునరుద్దరణ

క్రెడిట్ చెల్లింపుల నిలిపివేతకు సంబంధించి.. ఎల్ఐసీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే క్రెడిట్ కార్డ్ సేవలను త్వరలోనే పునరుద్దరించే ఛాన్స్ ఉందని ఎల్ఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం మరొక పేమెంట్ గేట్‌వే ప్రొవైడర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవి కొలిక్కే వస్తే తిరిగి క్రెడిట్ చెల్లింపులు మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read:ఇంట్లో దోమలు ఉన్నాయా? కాయిల్స్ vs ఎలక్ట్రిక్ వేపరైజర్లలో.. ఏది బెస్ట్ చాయిస్?

Related News

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

Big Stories

Advertisement
×