RBI Action On Paytm Payments Bank: ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎంపై ఆర్బీఐ చర్యలు తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. మార్చి 15,2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల ఖాతాలు, వాలెట్లు , డిపాజిట్లు లేదా క్రిడెట్‌లకు అనుమితి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం @paytm యూపీఐ హ్యాండిల్ ను ఉపయోగిస్తున్న మర్చంట్లు, కస్టమర్లకు ఎలాంటి అవంతరాలు లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి అదనపు చర్యలు అవసరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
పేటీఎం యూపీఐ ఛానెల్ ద్వారా పేమెంట్స్ కొనసాగించేందుకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా మారడానికి One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థనను పరిశీలించమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( NCPI)కి ఆర్బీఐ సూచించింది.
ప్రస్తుతం @paytm యూపీఐ హ్యాండిల్ ఉపయోగిస్తున్న మర్చంట్లు, కస్టమర్లకు మాత్రమే ఈ చర్యలు వర్తిస్తాయి. మీరు కూడా @paytm హ్యాండిల్‌ను యూపీఐ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నట్లు ఈ వివరాలు తెలుసుకోండి.
Read More: సొంత కార్లు ఆ దేశంలో ఎక్కువ..
వన్ 97 కు థర్డ్ పార్టీ అప్లకేషన్ ప్రొవైడర్ హోదాను NPCI కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా @paytm హ్యాండిల్స్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకులకు తరలించేలా RBI చర్యలు తీసుకోనుంది. అధిక సంఖ్యలో యూపీఐ లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యాలు కలిగిన 4-5 బ్యాంకులను పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (PSP) బ్యాంక్‌లుగా ధృవీకరించాలని ఎన్పీసీఐని కోరింది.
అంతేకాకుండా పేటీఎం QR కోడ్‌లను ఉపయోగించే వ్యాపారి అయితే ఇతర బ్యాంకులతో మీ అకౌంట్లను పేటీఎం సెటిల్ చేయనుంది. అంటే మీ పేటీఎం యూపీఐని ఇక నుంచి వేరే బ్యాంకులు హ్యాండిల్ చేస్తాయి. పేటీఎం కేవలం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా మాత్రమే ఉండనుంది.
మార్చి 15 లోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతాలు, వాలెట్ ఉన్న కస్టమర్‌లు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ మరోసారి తేల్చిచెప్పింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లను (NCMC) కలిగి ఉన్నవారు కూడా మార్చి 16 లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
Read More: అంబానీ ఇంట పెళ్లిసందడి.. అతిథుల లిస్ట్ లో దేశవిదేశాల రాజులు, రాణులు
పేటీఎంపై తీసుకున్న చర్యలన్నీ కూడా కస్టమర్లను, చెల్లింపు వ్యవస్థను రక్షించే ఉద్దేశంతోనే చేపట్టినట్లు ఆర్బీఐ పేర్కొంది. పేటీఎం పేమెండ్స్ బ్యాంక్ పై తీసుకున్న చర్యల్లో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేసింది.