BigTV English

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ‘రియల్’ బూమ్.. ఆకాశాన్ని తాకిన ధరలు

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ‘రియల్’ బూమ్.. ఆకాశాన్ని తాకిన ధరలు

Hyderabad: దేశంలో భూముల ధరలు రెక్కలు వస్తున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కాసేపు పక్కనబెడితే.. ముఖ్యమైన నగరాల్లో భూములు, అపార్టుమెంట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎయిర్‌పోర్టులకు సమీపంలో వాటి గురించి చెప్పనక్కర్లేదు. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఆ ప్రాంతాల్లో ప్లాట్లకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు ‘స్క్వేర్ యార్డ్స్’ రిపోర్ట్ తెలిపింది.


హైదరాబాద్‌‌తోపాటు ప్రధాన నగరాల్లో మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఆస్తుల విలువలు అమాంతంగా పెరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఊహించని వృద్ధిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు సమీపంలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల ధరలు అనూహ్యంగా పెరిగినట్టు స్క్వేర్ యార్డ్స్ నివేదిక తేల్చింది.

ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు వేగంగా విలువను పెంచుకుంటున్నట్లు తేలింది. గడిచిన నాలుగేళ్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ధరలు పెరిగాయి. విమానాశ్రయాలున్న ప్రాంతాల్లో ప్లాట్ల విలువలు 84–118 శాతం పెరిగినట్టు వెల్లడించింది. అపార్ట్‌మెంట్ల ధరలు 93 శాతం వృద్ధి చెందాయి.


దక్షిణ హైదరాబాద్‌ల్లో అపార్ట్‌మెంట్లకు 69 నుంచి 90 శాతానికి, ప్లాట్లకు 84 నుంచి 118 శాతానికి పెరిగాయి. ప్లాట్ల ధరలు చదరపు అడుగుకు సగటున 55 వేల నుంచి 60 వేల మధ్య పలుకుతోంది. నాలుగేళ్లలో 84 శాతం వృద్ధిని నమోదైంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పన్వెల్ (నవీ ముంబై), ఉత్తర బెంగళూరు పరిస్థితి ఈ స్థాయిలో ఉంది.

ALSO READ: భారత్ లోకి టెస్లా గ్రాండ్ ఎంట్రీ, ముంబైలో షోరూమ్ ఓపెన్

హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు చదరపు అడుగు 75 వేల నుంచి 80 వేల మధ్య ఉండగా, వృద్ధి కేవలం 59 శాతం నమోదైంది. సౌత్ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే చదరపు అడుగుకు 6 వేల నుంచి 8 వేలతో 74 శాతం వృద్ధి కనిపించింది. ఇతర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు చదరపు అడుగు 9 వేల నుంచి 11 వేల మధ్య పలుకుతోంది.

ఆ ప్రాంతాల్లో వృద్ధి 48 శాతంగా ఉన్నట్లు తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్టుమెంట్లు రేట్ల పెరుగుదలకు కారణాలు చాలానే ఉన్నాయి. కనెక్టివిటీ, ఉపాధి కేంద్రాలు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి స్థిరాస్తి అభివృద్ధికి కీలకంగా మారినట్టు స్క్వేర్ యార్డ్స్ సీఈఓ, వ్యవస్థాపకుడు తనుజ్ షోరి పేర్కొన్నారు.

విమానాశ్రయాలకు సమీపంలోని మైక్రో-మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా ఉందన్నారు.  నార్త్ బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, పన్వేల్ ప్రాంతంలోని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, సౌత్ హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ విమానాశ్రయం వంటి ప్రాంతాలు విమానాశ్రయ ఆధారిత వృద్ధికి ఉదాహరణ.

ఆయా కారిడార్లలో రెసిడెన్షియల్ హౌసింగ్ మార్కెట్ నిలకడగా వృద్ధి నమోదైంది. విమానాశ్రయాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భూములు, అపార్టుమెంట్లకు ధరలు పెరిగే అవకాశముందన్నమాట.

Related News

IRCTC business ideas: రైల్వే టికెట్ బుకింగ్ బిజినెస్.. నెలకు లక్షలు సంపాదించే సీక్రెట్ ఇదే!

Tata New Curvv: టాటా నుంచి సరికొత్త కారు.. రూ.10 లక్షలకే అదిరిపోయే లుక్‌తో!

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కస్టమర్లకు పండగే!

DMart: డిమార్ట్ సొంత బ్రాండ్ రేట్లు అంత తక్కువా? మిగతా బ్రాండ్ల ధరలతో ఉన్న తేడా ఏంటీ?

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ

Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

Big Stories

×