Lokesh Kanagaraj: ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి సినిమాలతో తనను తాను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా చెలామణి అవుతున్న ఈయన.. రజనీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పుదిద్దుకునే ఛాన్స్ కావాలి అని లోకేష్ తెలిపారు. దీంతో అంతలా ఏం తప్పు చేశారు? అసలు ఏం జరిగింది? ఆ ఛాన్స్ ఎవరివ్వాలి? అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
లోకేష్ కనగరాజు పై సంజయ్ దత్ అసహనం..
అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) ‘కేడి ద డెవిల్’ అనే సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం మొత్తం చెన్నైలో ల్యాండ్ అయింది. అందులో భాగంగానే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ మాట్లాడుతూ.. “రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజనీకాంత్ తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు చేశాను. విజయ్ దళపతి (Vijay Thalapathi) తో కూడా ‘లియో’ సినిమా చేశాను. అయితే నాకు లోకేష్ కనగరాజు పై చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నా టైం వేస్ట్ చేశాడు. నన్ను వేస్ట్ చేశాడు” అంటూ నవ్వుతూ సమాధానం తెలిపాడు. అయితే ఈ మాటలు కాస్త లోకేష్ కనగరాజు వరకు చేరడంతో తాజాగా ఆ మాటలకు లోకేష్ స్పందించారు.
సంజయ్ దత్ కామెంట్స్ పై లోకేష్ కనగరాజు స్పందన..
ఇకపోతే సంజయ్ దత్ కామెంట్లు తనవరకు చేరడంతో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ.. “సంజయ్ తో నేను మరో సినిమా తీసి, నా తప్పు సరిదిద్దుకుంటాను. అయితే ఆయన నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి” అంటూ లోకేష్ కనగరాజు తెలిపారు. మొత్తానికైతే లియో సినిమా డిజాస్టర్ కావడం దీనికి తోడు ఈ సినిమాలో చిన్న పాత్రతో సరిపెట్టినందు వల్ల సంజయ్ దత్ ఫీలయ్యారని తెలుసుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు మరొక ఛాన్స్ ఇవ్వాలి అని, అప్పుడు ఆయనను తనదైన శైలిలో తెరపై చూపిస్తాను అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. మరి సంజయ్ దత్ లోకేష్ కనగరాజు కి తప్పు దిద్దుకునే అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
లోకేష్ కనగరాజు కెరియర్..
లోకేష్ కనగరాజు కెరియర్ విషయానికొస్తే.. స్వతహాగా బ్యాంకు ఉద్యోగి అయిన లోకేష్ కనగరాజు.. ‘మా నగరం’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఖైదీ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక 2023లో దళపతి విజయ్ తో లియో సినిమా చేశారు. అయితే ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నారు.
also read:Nainisha Rai: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న బ్రహ్మముడి అప్పు.. వరుడు హీరో అని మీకు తెలుసా?