BigTV English

Real Estate: కొత్త ఇల్లు కడుతున్నారా…అయితే ఏమేం పర్మిషన్లు కావాలో వెంటనే తెలుసుకోండి..

Real Estate: కొత్త ఇల్లు కడుతున్నారా…అయితే ఏమేం పర్మిషన్లు కావాలో వెంటనే తెలుసుకోండి..

కొత్త ఇల్లు కడుతున్నారా అయితే దానికి కావలసిన అనుమతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇల్లు కట్టడానికి పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి అనేది తప్పనిసరి. లేకపోతే భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేకపోతే జరిమాణాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకుంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . అందులోనూ ముఖ్యంగా నగరాల్లో కొత్త ఇల్లు నిర్మించడానికి కావాల్సిన పర్మిషన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


లేఅవుట్ అప్రూవల్
ముందుగా మీరు మీ ప్లాటులో ఇల్లు నిర్మించాలి అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన ఇంటి ప్లాన్ తయారు చేయించుకోవాలి దీనినే లేఅవుట్ అంటారు. అది కూడా ఒక ఆర్కిటెక్ట్ లేదా సివిల్ ఇంజనీర్ తో ఈ ప్లాన్ తయారు చేయించుకోవాలి. ఈ ప్లాన్ లో భాగంగా మీ ఇంటికి కొలతలతో పాటు గదుల నిర్మాణము, ఇంటి చుట్టూ వదిలే స్థలం ఏరియా అని కూడా అంటారు. అలాగే నిర్మాణానికి సంబంధించిన ఇతర వివరాలు అందులో క్షుణ్ణంగా ఉండాలి. ఆ తర్వాత ఈ లేఅవుట్ ప్లాన్ ను మీ స్థానిక మునిసిపాలిటీ, లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో సమర్పించి లేఅవుట్ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. దీనినే బిల్డింగ్ పర్మిషన్ అని కూడా పిలుస్తారు. మీరు కనుక ఈ అప్రూవల్ పొందకపోతే మీ కట్టడాన్ని ఒక అక్రమ కట్టడం గా పరిగణించే అవకాశం ఉంటుంది.

ఆక్యుపెన్సి సర్టిఫికెట్
మీ ఇల్లు ప్లాన్ ప్రకారం నిర్మించారు అనేందుకు రుజువు కోసం ఆక్యుపెన్సివ్ సర్టిఫికెట్ అనేది స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఉంటుంది. ఆక్యుమెంట్రీ సర్టిఫికెట్ అనేది చాలా తప్పనిసరి డాక్యుమెంట్ అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు భవిష్యత్తులో మీ ఇంటిపై లోన్ తీసుకోవాలన్నా, మరొకరికి విక్రయించాలన్నా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి.


వాటర్ కనెక్షన్ పర్మిషన్: మీ ఇంటికి మంచి నీటి కనెక్షన్ కోసం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అనుమతి పొందాల్సి ఉంటుంది దీని కోసం నిర్ణీత రుసుము చెల్లించినట్లయితే మీ ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తారు.

సివరేజ్, డ్రైనేజ్ కనెక్షన్ పర్మిషన్: ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన కనెక్షన్. మీ ఇంటి డ్రైనేజీ స్థానిక సీవరేజ్ బోర్డు నుంచి కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటే మురుగునీరు డ్రైనేజీలో కలిపేందుకు అనుమతి లభిస్తుంది.

ఎలక్ట్రిసిటీ పర్మిషన్: మీ ఇంటి విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరిగా ఈ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అందించాల్సి ఉంటుంది.

ఒకవేళ మీరు నిర్మిస్తున్నటువంటి ఇల్లు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలో తెలుసుకుందాం:

>> ఒకవేళ మీరు ఇల్లు నిర్మిస్తున్న ప్రాంతం గ్రామపంచాయతీ పరిధిలో ఉంటే తప్పనిసరిగా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
>> గ్రామపంచాయతీ అనుమతి కోసం మీ టైటిల్ డీడ్, సేల్ డీడ్ ఇంటి ప్లాన్ కాపీ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
>> ఒకవేళ మీరు నిర్మిస్తున్నటువంటి గ్రామపంచాయతీ డిటిసిపి పరిధిలో ఉన్నట్లయితే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్మిషన్ తీసుకున్న 6 నెలల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. అలాగే మూడు సంవత్సరాల లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోతే అనుమతులు రద్దు అవుతాయి.

Related News

Gold saving schemes: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్.. డోంట్ మిస్!

ATM transaction: ఆర్‌బీఐ కొత్త ఏటీఎం నియమాలు.. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే బాదుడే..

Gold: బంగారం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది? ఎవరి కాలంలో తీసుకొచ్చారు? శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా తేల్చిందేంటి?

Vishal Mega Mart: విశాల్ మార్ట్‌ లో దొంగతనాలు, మరీ.. అండర్ వేర్లు కూడానా?

D-Mart vs LuLu Mall: లులు మాల్‌కు ఎందుకంత క్రేజ్? వస్తువులు డిమార్ట్ కంటే చీపా?

Big Stories

×