BigTV English

Daisy Shah: సౌత్ హీరోయిన్ల పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. ఆ పిచ్చి ఎక్కువ అంటూ!

Daisy Shah: సౌత్ హీరోయిన్ల పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. ఆ పిచ్చి ఎక్కువ అంటూ!

Daisy Shah: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో నటి డైసీ షా(Daisy Shah) ఒకరు. ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆచార్య గణేశన్ (Acharya Ganeshan)కు అసిస్టెంట్ గా పనిచేస్తున్న డైసీ అనంతరం కన్నడ భద్ర సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ సినిమాలలో బిజీ అయ్యారు. అయితే సల్మాన్ ఖాన్ తో నటించిన జై హో సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.


బొడ్డు చూపించే పిచ్చి ఎక్కువ..

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైసీ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారి గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఎక్కువగా నడుము అందాలను బయట పెడతారని, వారికి నడుము , బొడ్డు (Navel) చూపించే పిచ్చి అలవాటు ఉంది అంటూ డైసీ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను కన్నడ సినిమా సమయంలో ఈ విషయాన్ని పూర్తిగా గమనించానని తెలియజేశారు.


పండ్లు వేసి సలాడ్ చేశారు…

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుమును ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయరని కానీ సౌత్ హీరోయిన్లు మాత్రం ఎక్కువగా నడుమును చూపిస్తారని తెలిపారు. కన్నడ చానల్లో ఒక హీరో హీరోయిన్ బొడ్డుపై పండ్లు వేసి ఆమె నడుమును ఒక సలాడ్ లాగా మార్చేసాడని డైసీ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నడుము బొడ్డుపై కెమెరా క్లోజప్ పెట్టి చూపించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇది మరి కాస్త ఎక్కువగా ఉందని ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే సౌత్ హీరోయిన్ల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.

ఇక గతంలో కూడా పలువురు హీరోయిన్లు నడుపు సన్నివేశాల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈమె తన సినీ కెరియర్ లోను అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక డైసీ కెరియర్ విషయానికి వస్తే.. ఈమె చివరిగా మిస్టరీ ఆఫ్ ద టాటూ సినిమాలో నటించారు. గత ఏడాది రెడ్ రూమ్ అనే ఎంఎం వెబ్ సిరీస్ లో నటించారు. ఇలా పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న డైసీ ఇలా సౌత్ హీరోయిన్ ల గురించి మాట్లాడటంతో ఈమె వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇలా గ్లామర్ షో చేయటం సర్వసాధారణం. ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్ గ్లామర్ షో చేసినప్పటికీ సౌత్ హీరోయిన్ల గురించి డైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

Related News

Sai Durga Tej: టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభించిన మోగా హీరో

Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన

Dark Chocolate Teaser: డార్క్ చాక్లెట్ టీజర్ రిలీజ్.. టీజర్ మొత్తం బూతులే !

K – Ramp Trailer : ట్రైలర్ కూడా ర్యాంప్, ఓపెనింగ్స్ ఖాయం 

Pawan Kalyan: మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. ఎమోషలైన పవన్ కళ్యాణ్!

Trivikram : పని అయిపోయింది పడిపోయాడు అనుకున్నారు, కానీ కెరటంలా పైకి లేచాడు

Vijay Devarakonda: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ కోసం రంగంలోకి మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Yellamma: నితిన్‌ చేజారిన ఎల్లమ్మ.. రంగంలోకి బెల్లంకొండ హీరో?

Big Stories

×