BigTV English

Arjun Das: ప్రేమలో పడ్డ అర్జున్ దాస్.. ఆమెను ఎలా పడేసారబ్బా!

Arjun Das: ప్రేమలో పడ్డ అర్జున్ దాస్.. ఆమెను ఎలా పడేసారబ్బా!

Arjun Das:ప్రముఖ నటుడిగా పేరు సొంతం చేసుకున్న అర్జున్ దాస్ (Arjun Das) .. 2012లో తమిళ సినిమా ‘పెరుమాన్’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకున్న ఈయన.. 2019లో విడుదలైన ‘కైతి’ సినిమాలో అన్బు పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఈ పాత్రలో ఈయన నటనకు పలు అవార్డులు కూడా లభించాయి. 2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటు సినిమాలే కాదు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అయిన ‘పుతంపుధు కాలై విదియాధా’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. అంతేకాదు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలలో కూడా సందడి చేశారు.


ప్రేమలో పడ్డ అర్జున్ దాస్..

ప్రస్తుతం విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అర్జున్ దాస్ తాజాగా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మాయి ఎవరో తెలిసి ఆమెను ఎలా పడేశారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అర్జున్ దాస్ ప్రేమలో పడ్డ అమ్మాయి ఎవరు? ఆమె ఏం చేస్తుంది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మీ (Ishwarya Lakshmi) .. అర్జున్ దాస్ ఈమె ప్రేమలో పడినట్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ రూమర్ గతంలో కూడా వినిపించింది. అప్పట్లో ఇద్దరు ఖండించారు కూడా.. అయితే మళ్లీ ఇద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ తో పాటు మూవీ కూడా చేస్తుండడంతో ఈ రూమర్స్ మళ్లీ వినిపిస్తున్నాయి.


మళ్లీ రూమర్స్ రావడానికి కారణం అదే..

ఆర్జే నుండి యాక్టర్ గా మారిన అర్జున్ దాస్ యూటర్న్ తీసుకోగా.. అటు డాక్టర్ చదివి ఐశ్వర్య లక్ష్మి యాక్టర్ అయ్యింది. ముఖ్యంగా తన పెక్యులర్ వాయిస్ తో అర్జున్ దాస్ ఫేమస్ అయ్యారు. ఐశ్వర్య సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తోంది. జీవితంలో పెళ్లి అంటే తనకు ఇష్టం లేదని ,ఇక ప్రేమ జోలికి అసలు వెళ్ళనని స్టేట్మెంట్ ఇచ్చిన ఈమె.. ఇప్పుడు అర్జున్ దాస్ ను ప్రేమిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న చాలా మంది ఇందులో నిజం లేదంటుంటే.. మరికొంతమంది అసలు జీవితంలో పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ఎలా పడేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ జంట ఇప్పుడు రూమర్స్ ఎదుర్కొంటోంది అని చెప్పవచ్చు.

ALSO READ:Ananya Pandey: బాడీ షేమింగ్ పై అనన్య ఎమోషనల్ కామెంట్స్.. ముఖం మీదే చెప్పారంటూ?

Related News

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Kajol: కాజోల్ పై బాడీ షేమింగ్.. సిగ్గులేదా అంటూ ప్రముఖ నటి ఫైర్!

Peddi : రామ్ చరణ్ సినిమాలు రిజెక్ట్ చేసిన మలయాళం బ్యూటీ

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Raja saab : రాజా సాబ్ లైన్ క్లియర్, ఇంకా ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టారా?

Big Stories

×