E-Paper
Advertisement

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..
Advertisement

Gold Price Today: అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్ వాతావరణం కాస్త మెరుగుపడింది. ఫలితంగా చమురు ధరలు పతనం కావడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లు వైపు మొగ్గు చూపారు. సోమవారం దేశ రిటైల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది.

అంతర్జాతీయ సానుకూల పవనాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లను తాకింది. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులను వాయిదా వేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో ఆసియా మార్కెట్ల ప్రారంభంలో చమురు ధరలు పతనమయ్యాయి. ఈ రెండింటికి తోడు ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకున్న వేళ, మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపారు. ఫలితంగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే బంగారం ధరలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం ధరలకు రెక్కలు

Advertisement

శుక్రవారం రోజుతో పోలిస్తే బ్రెంట్ క్రూడాయిల్ ధర సోమవారం 5 శాతం వరకు తగ్గి 83.50 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అటు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. తాజాగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4060 డాలర్లకు చేరింది. సిల్వర్ రేటు 58 డాలర్లకు సమీపంలో కొనసాగుతోంది. అటు డాలరుతో రూపాయి విలువ రూ. 95.39 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

దేశీయంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉదయం 9.13 గంటలకు ఆగస్ట్ 3న MCX బంగారం ధర 10 గ్రాములకు రూ. 143,640 వద్ద ట్రేడ్ అవుతోంది . MCX వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.  218,750 వద్ద ట్రేడ్ జరుగుతోంది.

వివిధ నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా
Advertisement

సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర తులం రూ. 1,31,786 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ. 1, 43,740 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో కేజీకి రూ. 2.35 లక్షల వద్ద ఉంది.

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 143,150 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 131,221 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 143,400 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 131,450 అమ్మకాలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 143,510 ఉండగా, 22 క్యారెట్ల రూ. 131,551 వద్ద ఉంది.

ALSO READ: ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 143,210 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.131,276 వద్ద ట్రేడ్ జరుగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 143,930 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 131,936 గా ఉంది. ఇక వెండి ధరల విషయంలో హైదరాబాద్ ధరకు నాలుగైదు వందలు అటు ఇటుగా ఉంది. ఈ ధరలు ఉదయం 9 గంటలవి మాత్రమే. ఆ తర్వాత హెచ్చుతగ్గులు ఉంటాయి. కొనుగోలుదారులు గమనించగలరు.

 

Related News

“యుపిఐ బ్యాన్, క్యాష్ మాత్రమే”.. ఢిల్లీ, ఎంపీ షాపులు, పెట్రోల్ పంప్స్‌లో వ్యాపారుల నిర్ణయం

మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..

రోజుకు రూ.50 పొదుపుతో.. ఏకంగా రూ.14 లక్షల ఆదాయం.. ఏం చేయకుండానే సంపాదించొచ్చు!

చెక్‌పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?

నోటీస్ పీరియడ్ డబ్బు చెల్లించి ఉద్యోగం వదిలేయవచ్చా.. కంపెనీ రిలీవ్ చేయకపోతే ఏం చేయాలి?

80 మంది భారతీయులను తొలగించిన అమెరికన్ కంపెనీ.. కేవలం 5 నిమిషాల్లో షాకింగ్ నిర్ణయం

కేంద్రానికి పెట్రోల్ డీలర్లు హెచ్చరిక.. UPI చెల్లింపులకు బ్రేక్, దేశవ్యాప్తంగా ఇకపై క్యాష్

రెండుగా చీలిన టాటా గ్రూప్.. చంద్రశేఖరన్ ‘మళ్లీ ఓకే’.. నోయెల్ టాటా ‘నాట్ ఓకే’!

Big Stories

Advertisement
×