E-Paper
Advertisement

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!
Advertisement

Vi Spotify Plans: కస్టమర్లను ఆకట్టుకునేందుకు వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మొబైల్ రీచార్జ్‌తో పాటు సంగీత ప్రియులను అలరించేలా ‘స్పాటిఫై ప్రీమియం’ (Spotify Premium) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వేర్వేరు సబ్‌స్క్రిప్షన్లు తీసుకోకుండా ఒకే రీచార్జ్‌తో డేటా, ఫ్రీ కాల్స్, వినోదాన్ని యూజర్లకు అందుబాటులోకి తేవడమే ఈ ప్లాన్ల ప్రధాన ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏవి? వాటి వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వీఐ రూ. 435 ప్లాన్

మ్యూజిక్ కేటగిరిలో వీఐ తెచ్చిన ఈ ప్రీమియం ప్లాన్ లో.. అపరిమిత డేటా యూజర్లకు లభించనుంది. అలాగే ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు స్పాటిఫై ప్రీమియం సబ్ స్క్రిప్షన్, జియో హాట్ స్టార్ ఓటీటీకి యాక్సెస్ లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజులుగా వీఐ నిర్ణయించింది.

వీఐ రూ.250 ప్లాన్..

Advertisement

బడ్జెట్ యూజర్ల కోసం తీసుకువచ్చిన ఈ ప్లాన్‌లో యూజర్లకు ప్రతీ రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్లాన్ మెుత్తానికి 300 SMSలు లభించనున్నాయి. అలాగే స్పాటిఫై ప్రీమియం బెనిఫిట్స్ సైతం పొందొచ్చు. ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడితో వచ్చింది.

వీఐ రూ. 230 ప్లాన్

ఈ ప్లాన్ లో 30GB హై స్పీడ్ డేటాతో పాటు స్పాటిఫై ప్రీమియం యూజర్లు పొందొచ్చు. అంతేకాకుండా జియో-హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఫ్యాన్‌కోడ్, లయన్స్ గేట్ ప్లే వంటి 20కి పైగా ఓటీటీ ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల పాటు లభిస్తుంది.

స్పాటిఫై ప్రీమియంతో బెనిఫిట్స్

Advertisement

స్పాటిఫై ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను పొందడం ద్వారా.. ఎలాంటి యాడ్స్ లేని మ్యూజిక్ ను వీఐ యూజర్లు అస్వాదించవచ్చు. అలాగే పాటలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు అత్యుత్తమ ఆడియో క్వాలిటీతో పాటలు వినే వీలుకలుగుతుంది.

Also Read: భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. వీసా పొడిగింపు పైనా ‘బాదుడే బాదుడు’!

స్పాటిఫై ఎలా యాక్టివేట్ చేయాలి?

పైన పేర్కొన్న ప్లాన్లలో ఒకదానిని రీఛార్జ్ చేసుకున్న తర్వాత.. ఫోన్‌లోని ‘వీఐ యాప్’ ఓపెన్ చేయాలి. అందులో ‘యాక్టివ్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి ‘క్లెయిమ్ బెనిఫిట్స్’ ఆప్షన్‌ ను ఎంచుకోండి. అక్కడ స్పాటిఫై ప్రీమియం పక్కన ఉన్న ‘క్లెయిమ్’ బటన్‌పై క్లిక్ చేసి.. స్పాటిఫై ఖాతాతో లాగిన్ అవ్వడం లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేసుకోవడం ద్వారా ప్రీమియం సేవలను పొందొచ్చు.

Also Read: మళ్లీ వివాదంలో టెలిగ్రామ్.. ఈసారి యాపిల్ స్టోర్ నుంచి అవుట్.. అసలేం జరుగుతోంది!

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×