E-Paper
Advertisement

పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. మార్కెట్లో తులం ధర ఎంత? ఇంకెందుకు ఆలస్యం

పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్..  మార్కెట్లో తులం ధర ఎంత? ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Gold Price Today: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లు గ్రీన్ సూచీలో కదిలాయి. దీని ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెట్టుబడిదారులు బేరీజు వేసుకుంటున్నారు. ఫలితంగా బంగారం-వెండి ధరల స్థిరంగా కొనసాగుతున్నాయి.

స్థిరంగా బంగారం-వెండి ధరలు

మిత్ర దేశాల అభ్యర్థనల నేపథ్యంలో ఇరాన్‌పై దాడులు నిలిపి వేసినట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సోమవారం రోజు ముడి చమురు ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడినా దేశీయంగా బంగారం-వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి-వెండి ధరలు ఫ్లాట్‌గా కొనసాగాయి. కొన్నాళ్ల కిందట క్రూడాయిల్ ధరలు పెరిగితే బంగారం-వెండి ధరలు తగ్గడం మొదలయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రూడాయిల్ ధరలతో సంబంధం లేకుండా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయంతోపాటు దేశీయ మార్కెట్లో గోల్డ్-సిల్వర్ ధరలపై ఓ లుక్కేద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి?

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు అదే 4050 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు పరిశీలిస్తే.. 58.67 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరల మాదిరిగా దేశీయంగా స్థిరంగా ఉన్నాయి. డాలరుతో రూపాయి విలువ ప్రస్తుతం రూ. 95.40 వద్ద ఉంది.

దేశీయ మార్కెట్లో ధరల మాటేంటి?

భారత బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్, విజయవాడలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఆగస్టు 4న ఉదయం 9 గంటలకు 10 గ్రాములు రూ. 1,44,220 పలుకుతోంది.అదే 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 1,32,200 వద్ద ఉంది. గడిచిన మూడురోజులతో పరిశీలిస్తే రూ. 350 తగ్గింది. గోల్డ్ బాటలో వెండి ధరలు మారలేదు.బంగారు ఆభరణాల ధర వస్తువులను తయారీని బట్టి మారవచ్చు. స్థానిక పన్ను రేట్లు, షిప్పింగ్ ఛార్జీలు బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు షాపులను బట్టి మారుతుంటాయి. ఇక జీఎస్టీ ఎలాగూ ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా

Advertisement

ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం ధర రూ.1,44,360 ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.

ముంబై, బెంగుళురుల్లో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,44,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.

చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి తులం బంగారం ధర రూ.1,44,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,510 వద్ద కొనసాగుతోంది.

ALSO READ: ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

Related News

“యుపిఐ బ్యాన్, క్యాష్ మాత్రమే”.. ఢిల్లీ, ఎంపీ షాపులు, పెట్రోల్ పంప్స్‌లో వ్యాపారుల నిర్ణయం

మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..

రోజుకు రూ.50 పొదుపుతో.. ఏకంగా రూ.14 లక్షల ఆదాయం.. ఏం చేయకుండానే సంపాదించొచ్చు!

చెక్‌పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?

నోటీస్ పీరియడ్ డబ్బు చెల్లించి ఉద్యోగం వదిలేయవచ్చా.. కంపెనీ రిలీవ్ చేయకపోతే ఏం చేయాలి?

80 మంది భారతీయులను తొలగించిన అమెరికన్ కంపెనీ.. కేవలం 5 నిమిషాల్లో షాకింగ్ నిర్ణయం

కేంద్రానికి పెట్రోల్ డీలర్లు హెచ్చరిక.. UPI చెల్లింపులకు బ్రేక్, దేశవ్యాప్తంగా ఇకపై క్యాష్

రెండుగా చీలిన టాటా గ్రూప్.. చంద్రశేఖరన్ ‘మళ్లీ ఓకే’.. నోయెల్ టాటా ‘నాట్ ఓకే’!

Big Stories

Advertisement
×