E-Paper
Advertisement

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో
Advertisement

Salary Budget Planning| నెల జీతం అకౌంట్‌లో పడగానే అందరికీ ఆనందంగా ఉంటుంది. డబ్బులు వచ్చిన సంతోషంలో వెంటనే షాపింగ్ లేదా బయట మంచి రెస్టారెంట్‌తో భోజనం చేయాలని అనుకుంటారు. అయితే ఖర్చు చేసే ముందు ఆర్థిక ప్రణాళిక రూపొందించడం చాలా ముఖ్యం. జీతం వచ్చిన మొదటి రోజే బడ్జెట్ సిద్ధం చేస్తే నెల మొత్తం ఖర్చులను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే భవిష్యత్ లక్ష్యాల కోసం కూడా డబ్బు దాచుకోవడం సులభమవుతుంది.

చేతికి వచ్చే జీతాన్ని ఆధారంగా బడ్జెట్ రూపొందించండి

మీ బడ్జెట్‌ ఎప్పుడూ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యే సాలరీ ఆధారంగా రూపొందించాలి. వార్షిక సీటీసీని చూసి ఖర్చులు నిర్ణయించకూడదు. ఎందుకంటే పన్నులు, పీఎఫ్ వంటి కోతల తర్వాత మీకు వచ్చే మొత్తం తక్కువగా ఉంటుంది. చేతికి వచ్చే ఆదాయం తెలిసినప్పుడే ఆర్థికంగా సరైన ప్లానింగ్ చేయవచ్చు.

50 -20 – 20 -10 ఫార్ములా పాటించండి

Advertisement

నెలవారీ ఆదాయాన్ని పర్సెంటేజ్ ప్రకారం విభజించడం చాలా సులభమైన పద్ధతి. దీనివల్ల ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ముందుగా 50 శాతం, 20 శాతం, 20 శాతం, 10 శాతం లెక్కన మీ నెల జీతాన్ని విభజించాలి.

అవసరమైన ఖర్చులకు 50 శాతం

ఇంటి అద్దె లేదా హోమ్ లోన్ ఈఎంఐ, కిరాణా సరుకులు, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్, ప్రయాణ ఖర్చులు, బీమా ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజులు వంటి అవసరమైన ఖర్చులకు జీతంలో సగం కేటాయించాలి. ఈ చెల్లింపులు ముందుగా పూర్తి చేస్తే ఆలస్య రుసుములు పడవు.

పొదుపు, పెట్టుబడుల కోసం 20 శాతం

Advertisement

జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడుల కోసం కేటాయించాలి. అత్యవసర నిధి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో మంచి సంపద ఏర్పడుతుంది.

వ్యక్తిగత ఖర్చులకు 20 శాతం

షాపింగ్, బయట భోజనం, ప్రయాణాలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, హాబీల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తం కేటాయించాలి. ముందే పరిమితి నిర్ణయించుకుంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి.

భవిష్యత్ లక్ష్యాలకు 10 శాతం

మిగిలిన మొత్తాన్ని ముందుగానే రుణాలు తీర్చడానికి లేదా ఇల్లు కొనుగోలు, విహారయాత్ర, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి లక్ష్యాల కోసం ఉపయోగించవచ్చు.

అత్యవసర నిధిని తప్పనిసరిగా ఏర్పాటు చేయండి

అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే కనీసం మూడు నుంచి ఆరు నెలల అవసరమైన ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభించినా కాలక్రమంలో మంచి నిధి ఏర్పడుతుంది.

ఆటోమేటిక్ పేమెంట్స్ ఉపయోగించండి

ఎస్ఐపీ, ఈఎంఐ, బీమా ప్రీమియం, విద్యుత్ బిల్లుల వంటి చెల్లింపులకు ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఆలస్యం ఉండదు. అలాగే పొదుపు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతుంది.

Also Read: అమెరికాలో కస్టమర్లకు వందల కోట్లు పరిహారం చెల్లించిన కంపెనీ.. ఇండియాలో ఎందుకు ఇలా జరగదు?

ప్రతి నెల బడ్జెట్‌ రివ్యూ చేయాలి

నెల చివరలో మీరు ఎంత పొదుపు చేశారో, ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశారో పరిశీలించండి. ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేయండి. అవసరానికి అనుగుణంగా వచ్చే నెల బడ్జెట్‌ను సవరించండి.

ఈ తప్పులు చేయకండి

బడ్జెట్ సిద్ధం చేయకముందే ఖర్చు చేయడం మంచిది కాదు. నెల చివరి వరకూ పొదుపు వాయిదా వేయకండి. క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడకండి. అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. అవసరం లేని వస్తువుల కోసం అప్పులు తీసుకోవడం కూడా మానుకోవాలి.

Also Read: టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

మంచి ఆర్థిక అలవాట్లు మీ భవిష్యత్తును బలపరుస్తాయి

జీతం వచ్చిన రోజు కేవలం సంతోషపడడం కాదు. అదే రోజు బాధ్యతాయుతంగా సరైన ఆర్థిక ప్రణాళిక ప్రారంభిస్తే మీ భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుంది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

Related News

“యుపిఐ బ్యాన్, క్యాష్ మాత్రమే”.. ఢిల్లీ, ఎంపీ షాపులు, పెట్రోల్ పంప్స్‌లో వ్యాపారుల నిర్ణయం

మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..

రోజుకు రూ.50 పొదుపుతో.. ఏకంగా రూ.14 లక్షల ఆదాయం.. ఏం చేయకుండానే సంపాదించొచ్చు!

చెక్‌పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?

నోటీస్ పీరియడ్ డబ్బు చెల్లించి ఉద్యోగం వదిలేయవచ్చా.. కంపెనీ రిలీవ్ చేయకపోతే ఏం చేయాలి?

80 మంది భారతీయులను తొలగించిన అమెరికన్ కంపెనీ.. కేవలం 5 నిమిషాల్లో షాకింగ్ నిర్ణయం

కేంద్రానికి పెట్రోల్ డీలర్లు హెచ్చరిక.. UPI చెల్లింపులకు బ్రేక్, దేశవ్యాప్తంగా ఇకపై క్యాష్

రెండుగా చీలిన టాటా గ్రూప్.. చంద్రశేఖరన్ ‘మళ్లీ ఓకే’.. నోయెల్ టాటా ‘నాట్ ఓకే’!

Big Stories

Advertisement
×