E-Paper
Advertisement

Reliance Jio IPO: రికార్డులు బద్దలుగొట్టేందుకు సిద్ధమవుతోన్న జియో.. భారీ ఐపీఓ డ్రాఫ్ట్ పై పని ప్రారంభం

Reliance Jio IPO: రికార్డులు బద్దలుగొట్టేందుకు సిద్ధమవుతోన్న జియో.. భారీ ఐపీఓ డ్రాఫ్ట్ పై పని ప్రారంభం
Advertisement

Reliance Jio IPO: దేశంలోనే భారీ ఐపీఓకి ముఖేష్ అంబానీ రిలయన్స్ సిద్ధమైంది. భారత్ లోనే అతిపెద్ద 170 బిలియన్ డాలర్ల ఐపీఓ కోసం డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌పై పని ప్రారంభించింది. భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌ల ఐపీఓకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌పై పని ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఆగస్టులో జరిగిన ఓ కార్యక్రమంలో జియో లిస్టింగ్ 2026లో జరగవచ్చని ముఖేష్ అంబానీ చెప్పారు. జియో ఐపీఓ భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అవుతుందని భావిస్తున్నారు. రిలయన్స్ జియో 500 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్ బేస్‌తో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉంది.

ఐపీఓ ముసాయిదా

సాధ్యమైనంత త్వరలో స్టాక్ రెగ్యులేటర్‌కు దాఖలు చేయడానికి జియో డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను సిద్ధం చేస్తుంది రిలయన్స్. ఈ మేరకు రిలయన్స్ బ్యాంకులతో అనధికారికంగా చర్చలు జరుపుతోందని సమాచారం. భారతదేశంలో ఐపీఓలపై కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ దాఖలు, బ్యాంకర్లను అధికారికంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పబ్లిక్ ఇష్యూ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలకు IPOలలో కనీస డైల్యూషన్‌ను 2.5% వరకు తగ్గించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI గతంలో ఆమోదం తెలిపింది. ఈ మార్పు ఇంకా అమలులోకి రాలేదు.

Advertisement

Also Read: Floriculture: సొంతూరిలోనే లక్షలు సంపాదించే బిజినెస్‌ – ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వ్యాపారం ఇదే

Tags

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×