E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మానియేల్ పాట తెచ్చిన తంటా, నేను ఏ విషం ఇచ్చాను? సంజన సీరియస్

Bigg Boss 9 Telugu : ఇమ్మానియేల్ పాట తెచ్చిన తంటా, నేను ఏ విషం ఇచ్చాను? సంజన సీరియస్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇమ్మానుయేల్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మరోవైపు టాస్కులు కూడా చాలా బాగా ఆడతాడు. ముఖ్యంగా ఆ షో కి మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది అంటే కారణం ఇమ్మానియేల్ కామెడీ అని కూడా చెప్పొచ్చు. అలానే సీరియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు కాబట్టి మంచి రేటింగ్ సహజంగానే వస్తున్నాయి.

ఇమాన్యుల్ కేవలం కామెడీ చేయటం మాత్రమే కాకుండా ఆట ఆడే తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంది. అందుకే ఎవరైనా ఆడియన్స్ వస్తే ఫేవరెట్ కంటెంట్ ఎవరు అని అడిగితే ఇమ్మానుయేల్ పేరు చెబుతారు. మొత్తానికి ఇమ్మానుయేల్ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మాస్క్ మాన్ హరీష్ విషయంలో కూడా ఇమ్మానుయేల్ గుండా అంకుల్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అప్పుడు అతను ఎంటర్టైనర్ అని నాగార్జున చేసిన సపోర్ట్ కూడా చాలామందికి అగ్రి అనిపించింది.

పాట తెచ్చిన తంట 

Advertisement

ఇమ్మానియేల్ను నాగార్జున పాట పాడమని అడిగిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్మానుయేల్ పాడిన ఒక పాట ఇప్పుడు సంజనాతో గొడవ తీసుకొచ్చి పెట్టింది. సింహరాశి సినిమాలోని అమ్మ అని పిలిచి గుండె పిండకు రా అనే పాటను ఫిమేల్ వాయిస్ లో పాడాడు ఇమ్మానుయేల్.

అయితే ఆ పాటలోని కొన్ని లిరిక్స్ మాత్రం సంజనాకు విపరీతంగా గుచ్చుకున్నాయి అని ఏడ్చింది. తల్లిపాలు విషము రా అనే మాట సంజనాను విపరీతంగా బాధపెట్టిందట. నేను ఒక టాక్సిక్ మదర్ అని నాకు అనిపించింది అని ఇమ్మానుయేల్ తో బాధపడుతూ చెప్పింది సంజన.

ఆ ఉద్దేశంతో అనలేదు 

Advertisement

నేను మామూలుగా ఆ పాటను ఆ ఉద్దేశంతో పాడలేదు. నువ్వు అలా తీసుకుంటావని నేను అనుకోలేద. అమ్మ పాట పాడమంటే నాకు తెలిసింది అదే కాబట్టి నేను పాడాను. అంటూ సంజనాకు సమాధానం చెప్పాడు. ఎన్ని చెప్పినా కూడా సంజన కన్విన్స్ కాలేదు. మొత్తానికి సారీ చెబుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఇమ్మానుయేల్.

ఆ తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఆ ఉద్దేశంతో ఎవరైనా పాడుతారా. ఇంట్లో మా అమ్మ అడిగినా కూడా నేను అదే పాడుతాను అంటూ సుమన్ శెట్టితో క్లారిటీ ఇచ్చాడు ఇమ్మానుయేల్. మొత్తానికి తెలుగు కంప్లీట్ గా రాకపోవడంతో ఇటువంటి అపార్ధాలు ఎదురవుతాయి అని షో చూసే ఆడియన్స్ కి కూడా ఈ దెబ్బతో అర్థమయ్యేటట్లు ఉంది.

Also Read: Akhanda 2: మాటలు వద్దు మనీ కావాలి, అప్పుడే అఖండ నిర్మాతలతో మీటింగ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×