BigTV English

Rivian R1T, Rivian R1S: ఇదే కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 676 కి.మీ మైలేజ్.. రెండు మోడల్స్ వేరే లెవెల్..!

Rivian R1T, Rivian R1S: ఇదే కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 676 కి.మీ మైలేజ్.. రెండు మోడల్స్ వేరే లెవెల్..!

Rivian R1T, Rivian R1S Launched: ప్రస్తుతం దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ పరుగులు పెడుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనలపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ ఎస్యూవీలకి డిమాండ్ పెరిగింది. ఇందులో బాగంగానే తాజాగా అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు రివియన్ సెకండ్ జెన్ రివియన్ R1T EV పికప్ ట్రక్, రివియన్ R1S EV SUVని తాజాగా పరిచయం చేసింది.


ఈ రెండు కొత్త మోడల్‌లు కొత్త డ్రైవ్ సిస్టమ్‌లతో వస్తాయి. ఇవి ఇంతక ముందు ఉన్న వాహనాలతో పోలిస్తే భారీ మార్పులతో వస్తాయి. పనితీరు పరంగా చూస్తే ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తాయి. ఈ కొత్త వాహనాలు ఇప్పటికి ఉండే మోడళ్ల కంటే ఎక్కువ పవర్, రేంజ్‌ను అందిస్తాయి. ఇప్పుడు ఈ రెండు రివియన్ R1T, Rivian R1S EVకి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాల గురించి తెలుసుకుందాం.

Rivian R1T, Rivian R1S Price


Rivian R1T ప్రారంభ ధర $69,900గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 58,32,424గా ఉంటుంది. అదే విధంగా Rivian R1S ప్రారంభ ధర $75,900గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం.. ఇది సుమారు రూ. 63,33,061గా ఉంటుంది. ఈ రెండు మోడల్స్ అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. కొత్త మోడల్‌ను ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు.

Also Read: మహీంద్రా నుంచి కొత్త పికప్ ట్రక్.. రూ. 25 లక్షలతో త్వరలో లాంచ్!

Rivian R1T, Rivian R1S features

రివియన్ సెకండ్ జెన్ EVని రీ-ఇంజనీరింగ్ చేసారు. ఈ రెండు కొత్త మోడల్‌లు డ్యూయల్-మోటార్, ట్రై-మోటార్ లేదా క్వాడ్-మోటార్ పవర్‌ట్రైన్‌లతో వస్తాయి. క్వాడ్-మోటార్ సిస్టమ్‌తో కూడిన కొత్త R1T 1.. 025HP, 1,198 lb-ft టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 0-96 kmph నుండి 2.5 సెకన్ల కంటే తక్కువ సమయంలో వేగవంతమవుతుంది. ఈ మోడల్‌లో కొత్త బ్యాటరీ ప్యాక్ అందించబడింది. అందువల్ల దీనికి ఒక్కసారి ఫూర్తి ఛార్జింగ్ పెడితే ఏకంగగా 676 కి.మీ మైలేజీ అందిస్తుంది.

కొత్త రివియన్ R1T EV ట్రక్, R1S EV SUV శక్తివంతమైన US మార్కెట్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అదీగాక ట్రక్కుల అమ్మకాలు చాలా కాలంగా అమెరికాలో అత్యధికంగా సేల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సెకండ్ జెన్ రివియన్ R1T మార్కెట్లో ఉన్న ఫోర్డ్ F-150 సిరీస్, RAM 1500 సిరీస్‌లతో సహా మరిన్ని మోడళ్లతో పోటీపడుతుంది.

రివియన్ మార్కెట్‌లో పూర్తి-ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసిన మొదటి బ్రాండ్. అంతేకాకుండా R1Tకి మంచి ఆదరణ లభించింది. ఈ కొత్త మోడల్‌లు కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్ ఆర్కిటెక్చర్‌తో వస్తాయి. ఇవి సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త రివియన్ వాహనం డ్రైవర్ అసిస్ట్ అప్లికేషన్‌ల కోసం కొత్త సిస్టమ్‌తో వస్తుంది. మెరుగైన డ్రైవర్ సహాయం కోసం ఇది 11 కెమెరాలు, 5 రాడార్ పరికరాలు, AI ప్రిడిక్టివ్ ఫీచర్‌లను ఉపయోగిస్తుంది.

Tags

Related News

Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Big Stories

×