Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జి గురించి రూమర్స్, లీక్స్ చాలా రోజులుగా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు నిజంగానే షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా, ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యం వంటి అంశాలు ఈ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించేలా చేస్తున్నాయి.
200 మెగాపిక్సెల్ కెమెరా
ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండబోతుందనే వార్తలు ఉన్నాయి. సాధారణంగా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లను చూసి కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో ఉంటాం. కానీ 200 ఎంపీ అంటే ఒక ప్రొఫెషనల్ డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాకు సాటి స్థాయి క్వాలిటీని ఇస్తుంది. ఫోటోలోని ప్రతి డీటైల్ స్పష్టంగా కనపడుతుంది. నైట్ ఫోటోగ్రఫీ అయినా, జూమ్ షాట్స్ అయినా, క్వాలిటీ అసలు తగ్గదని చెబుతున్నారు. సామ్‌సంగ్ ఇప్పటి వరకు తయారుచేసిన అత్యంత శక్తివంతమైన కెమెరా సెన్సర్ ఇదే అవుతుంది.
స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్.. టెక్ లీక్స్
ఇందులో స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్ ఉండబోతుందని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇది క్వాల్‌కామ్ కంపెనీ తయారు చేస్తున్న లేటెస్ట్ ప్రాసెసర్. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న 888 ప్రాసెసర్ కంటే ఇది మరింత శక్తివంతమైనది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, హై స్పీడ్ ప్రాసెసింగ్ – అన్నింటికీ ఇది సూపర్ స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. హెవీ యాప్స్ అయినా, పెద్ద గేమ్స్ అయినా హ్యాంగ్ అవకుండా రన్ అవుతాయి.
Also Read: Airtel Offer: బఫరింగ్ లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్లు.. ఎయిర్‌టెల్ సంచలన ఆఫర్
16 జీబీ ర్యామ్-అమోలేడ్ డిస్‌ప్లే
16 జీబీ ర్యామ్‌తో వస్తుందని సమాచారం. సాధారణంగా ల్యాప్‌టాప్‌లలో కూడా 8 లేదా 12 జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ మొబైల్‌లోనే 16 జీబీ అంటే, ఏ యాప్ అయినా, ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా ఒకేసారి సులభంగా పనిచేస్తాయి. హై లెవెల్ మల్టీటాస్కింగ్ చేయాలనుకునే వారికి ఇది గేమ్‌చేంజర్ అవుతుంది.
ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే, సామ్‌సంగ్ ఎప్పటిలాగే అద్భుతమైన అమోలేడ్ డిస్‌ప్లే ఇవ్వబోతోందని చెబుతున్నారు. క్వాడ్ హెచ్‌డి, రెసల్యూషన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ డిస్‌ప్లేలో సినిమాలు, గేమ్స్, వీడియోలు అన్నీ మరింత క్లారిటీతో కనిపిస్తాయి. కళ్ళకు హాని లేకుండా లాంగ్ టైమ్ వాడటానికి ఇది సరైనది అని చెప్పుకోవచ్చు.
బ్యాటరీ -సెక్యూరిటీ పరంగా
బ్యాటరీ విషయానికి వస్తే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు 65డబ్ల్యూ లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశముంది. దీని వలన కొన్ని నిమిషాల్లోనే ఎక్కువ చార్జ్ అవుతుంది. అలాగే వైర్‌లెస్ చార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు ఫోన్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, సామ్‌సంగ్ యొక్క లేటెస్ట్ వన్ యూఐతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ఫోన్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు, అదనపు ప్రైవసీ ఆప్షన్లు ఉండబోతున్నాయి లీక్ ఇప్పుడు హాట్‌టాపిక్ గా మారాయి.
ధర ఎంతంటే?
ధర విషయానికి వస్తే, అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోయినా, లీక్స్ ప్రకారం ఈ ఫోన్ ధర సుమారు రూ. 90,000 నుండి 1 లక్ష మధ్య ఉండవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇతర బ్రాండ్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.