BigTV English

Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా!.. 2026లో మొబైల్ వరల్డ్‌కి రాజు ఇదే!

Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా!.. 2026లో మొబైల్ వరల్డ్‌కి రాజు ఇదే!

Samsung Galaxy: సామ్‌సంగ్ మళ్లీ ఒకసారి టెక్ ప్రపంచాన్ని షేక్ చేసింది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా 2026 గురించి లేటెస్ట్ లీక్స్, రూమర్స్ బయటకు వచ్చాయి. ప్రతి సారి ఎస్ సిరీస్ ఫోన్లు విడుదలైనప్పుడు మార్కెట్లో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు రాబోయే ఈ ఎస్26 అల్ట్రా కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు, స్పెసిఫికేషన్లు చూస్తే ఈ ఫోన్ నిజంగానే ఫ్యూచర్ టెక్నాలజీకి నిదర్శనం అన్నట్టే ఉంది. వన్ యూఐ 8తో పాటు అద్భుతమైన డిస్‌ప్లే, సూపర్ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్ అన్నీ కలిసొచ్చేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.


డిస్‌ప్లే- స్క్రీన్

ఇందులో 6.9 అంగుళాల భారీ AMOLED క్యూహెచ్‌డీ, స్క్రీన్‌ను అందించనున్నట్లు సమాచారం. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్‌ అయినా, సినిమాలు చూసే అనుభవం అయినా మరింత కొత్త స్థాయికి చేరుతుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లేలో స్క్రీన్ చుట్టూ ఉండే బార్డర్స్ (బెజెల్స్) దాదాపు లేనట్టే కనిపిస్తాయి.


ప్రాసెసర్ హైలెట్స్

ఇందులో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారని సమాచారం. దీని వల్ల స్పీడ్, మల్టీటాస్కింగ్, గేమింగ్ పనితీరు అన్నీ మరింత సాఫీగా సాగుతాయి. అదనంగా, 5G కనెక్టివిటీ (ఫోన్, కంప్యూటర్, టాబ్లెట్)తో పాటు వైఫై 7 సపోర్ట్ కూడా అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆకర్షణగా కెమెరా!

ఇందులోని కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 48ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, పెరిస్కోప్ జూమ్ లెన్స్‌తో కూడిన ఎస్26 అల్ట్రా మరింత శక్తివంతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించనుంది. 10ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ స్పేస్ జూమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయని సమాచారం. అదనంగా, నైట్ మోడ్, 8కే వీడియో రికార్డింగ్, ఏఐ ఆధారిత ఫోటో ఎడిటింగ్ సదుపాయాలు కూడా ఇందులో భాగమే.

Also Read: Nokia Oxygen Ultra 5G: నోకియా రీ ఎంట్రీ.. మార్కెట్‌లో గేమ్ ఛేంజర్! ధర, ఆఫర్లు పూర్తీ వివరణ?

బ్యాటరీ విషయానికి వస్తే

5500ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఈ ఫోన్‌లో ఉండబోతుందని చెబుతున్నారు. దాంతో కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తోనే గంటలకొద్దీ ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. అదనంగా, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా అందిస్తారని లీకులు చెబుతున్నాయి.

డిజైన్‌- సాఫ్ట్‌వేర్ హైలెట్స్

డిజైన్ విషయంలో కూడా మార్పులు ఉంటాయని టెక్ బ్లాగర్లు చెబుతున్నారు. ఫోన్ మరింత సన్నగా, స్టైలిష్‌గా, మేట్ ఫినిష్‌తో అందంగా కనిపిస్తుందని అంచనా. ఎస్‌పెన్‌కి కూడా కొత్త ఫీచర్లు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, వన్ యూఐ 8తో పాటు 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలు చేసినవారికి దీర్ఘకాలం పాటు కొత్త అప్‌డేట్స్ లభిస్తాయి.

ధర బెడ్జెట్‌లో ఉంటుందా?

ధరపై వస్తే, ఇది ప్రీమియం ఫోన్ కాబట్టి 1.3 లక్షల నుండి 1.5 లక్షల మధ్య ఉండవచ్చని రూమర్స్ చెబుతున్నాయి. కానీ అధికారిక ధర మాత్రం ఇంకా బయటపడలేదు. మొత్తానికి, గెలాక్సీ ఎస్26 అల్ట్రా 2026 టెక్నాలజీకి కొత్త బెంచ్‌ మార్క్ కానుందని ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం స్పష్టంగా సూచిస్తోంది. ఇది నిజంగానే 2026లో మొబైల్ మార్కెట్‌లో రాజుగానే నిలుస్తుందా అన్నది చూడాలి.

Related News

Mobile Data: మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ఈ టిప్స్ పాటిస్తే ఇక నో టెన్షన్!

Samsung Galaxy: ఏముంది భయ్యా.. సామ్‌సంగ్ గెలాక్సీ A17 5G కొత్త ఫోన్‌

Airtel 5G Plus: స్టోర్‌కి రాకండి, మేమే వస్తాం.. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్

Nokia Oxygen Ultra 5G: నోకియా రీ ఎంట్రీ.. మార్కెట్‌లో గేమ్ ఛేంజర్! ధర, ఆఫర్లు పూర్తీ వివరణ?

Airtel vs BSNL: 28 డేస్ వ్యాలిడిటీ.. ఈ ప్లాన్ వెనుక టెలికాం కంపెనీలు లాజిక్ ఇదే!

Big Stories

×