Nokia Oxygen Ultra 5G: నోకియా పేరు వినగానే గతంలో గడిపిన కాలం కళ్లముందు తిరుగుతుంది. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని తనదైన శైలిలో ఆకట్టుకున్న నోకియా, ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. నేటి ఫోన్లలో లక్షల్లో ఖర్చు పెట్టినా హీట్ అవ్వడం, పగలిపోవడం, బ్యాటరీ సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ “ఓల్డ్ ఈజ్ గోల్డ్” అన్న పేరు మాత్రం నోకియాతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈసారి తిరిగి రానున్న నోకియాపై వినియోగదారుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఉత్సాహానికి నిదర్శనంగానే నోకియా ఆక్సిజన్ అల్ట్రా 5G అనే కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది.
డిజైన్- డిస్‌ప్లే ఎలా ఉందంటే?
ఈ ఫోన్ డిజైన్ చూస్తే నిజంగా ప్రీమియం ఫీల్ కలుగుతుంది. ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లే, వెనుకభాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్. ఇక 6.9 ఇంచుల సూపర్ AMOLED డిస్‌ప్లేలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్ సపోర్ట్ అందిస్తుంది. అంటే గేమింగ్ కానీ, వీడియోలు కానీ సూపర్ స్మూత్‌గా కనిపిస్తాయి.
పెర్ఫార్మెన్స్ – ప్రాసెసర్ ఎలా ఉంది
పనితీరులో నోకియా ఈసారి రాజీ పడలేదు. నోకియా ఆక్సిజన్ అల్ట్రా 5Gలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ సిరీస్ ప్రాసెసర్‌ను అందించారు. దీనివల్ల మల్టీటాస్కింగ్, అధిక స్థాయి గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చాలా సులభంగా జరుగుతాయి
ర్యామ్ & స్టోరేజ్ పరిశీలిస్తే
ఇందులో 12జీబీ ర్యామ్‌ను వాడటం మరో పెద్ద ఆకర్షణగా నిలిచింది. అదనంగా 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే పెద్ద ఫైళ్ళు, సినిమాలు, యాప్స్ భద్రపెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Also Read: Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?
కెమెరా ప్రత్యేకతలు
ఇప్పుడు ఈ ఫోన్ అసలైన హైలైట్ చెప్పాలంటే 200ఎంపీ ప్రైమరీ కెమెరా. ఇంత భారీ కెమెరా సామర్థ్యం సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రమే కనిపిస్తుంది. దీని తోడుగా అల్ట్రా-వైడ్, టెలిఫోటో, మాక్రో లెన్స్‌లు కూడా ఉన్నాయి. 4కే, 8కే వీడియో రికార్డింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ అందిస్తోంది. అలాగే సెల్ఫీల కోసం 64ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.
బ్యాటరీ & ఛార్జింగ్
5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌కి 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీంతో కేవలం 20-25 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫోన్‌కి మరో పెద్ద ప్లస్ పాయింట్.
సాఫ్ట్‌వేర్ & ఫీచర్స్
ఆక్సిజన్ అల్ట్రా 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. ఇందులో 5G కనెక్టివిటీతో పాటు డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయం, స్టీరియో స్పీకర్లు కూడా అందిస్తున్నారు.
ధర & లభ్యత
మార్కెట్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూ.45,000 , రూ.50,000 మధ్య ఉండొచ్చని సమాచారం. కానీ బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, నోకియా ఈసారి మార్కెట్‌లో శక్తివంతమైన తిరిగి ప్రవేశం చేసింది. ఆక్సిజన్ అల్ట్రా 5Gలో ఉన్న కెమెరా సామర్థ్యం, వేగవంతమైన పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కలిపి వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్‌తో నోకియా తన బ్రాండ్ ప్రతిష్టను మరోసారి నిరూపించబోతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.