Tadipatri News: అనంతపురం జిల్లాలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన 24 గంటల్లోనే స్వగ్రామానికి బయలుదేరారు. పోలీసులు నోటీసులు ఇవ్వడమే అందుకు కారణమా? ఇంతకీ అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పెద్దారెడ్డి ఉంటే ఏదో విధంగా గొడవలు జరుగుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం తాడిపత్రిలో అడుగుపెట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎన్నికలు జరిగి 15 నెలలు తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి రానుండడంతో ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు ఫుల్‌ఖుషీ అయ్యారు.
పోలీసులు కూడా భారీ బందోబస్తు కల్పించారు. గుమ్మడికాయతో దిష్టి తీసి ఆయనను ఇంట్లోకి స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. ఇక తమకు ఎదురులేదని భావించారు ఆయన మద్దతుదారులు. ఈలోగానే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఆయనకు ఈ-మెయిల్ పంపారు. దాని సారాంశం ఏంటంటే.. ఈనెల 10న సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు వస్తున్నారు.
బలగాలు ఆయన టూర్‌కి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి సూచించారు పోలీసులు. పోలీసు బలగాలు సీఎం పర్యటకు కేటాయించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచన చేశారు. మెయిల్ చూసిన పెద్దారెడ్డి, ఆయన మద్దతుదారులు షాకయ్యారు.
ALSO READ: ఆదివారం గ్రహణం.. ఏపీ-తెలంగాణల్లో పలు ఆలయాలు మూసివేత
15 నెలల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చారని, కేవలం 24 గంటలు గడవగానే తాడిపత్రి విడిచి వెళ్లాలని చెప్పడం దారుణంగా ఉందన్నారు. పోలీసుల సూచనల మేరకు తాడిపత్రి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
దీనివెనుక జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారని అంటున్నారు కేతిరెడ్డి వర్గీయులు. పెద్దారెడ్డి రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. మొన్నటికి మొన్న అలాగే చేశారని, చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చారని అంటున్నారు. మళ్లీ ఈనెల 10 తర్వాత కేతిరెడ్డి మళ్లీ తాడిపత్రి వస్తారా? ఈ గోల ఎందుకని తన స్వగ్రామంలో ఉండిపోతారా? ఇవే ప్రశ్నలు ఆయన మద్దతుదారులను వెంటాడుతున్నాయి. పెద్దారెడ్డి వెళ్లిపోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అవుతారా? లేకుంటే సైలెంట్‌గా ఉంటారా? ఏదైతేనేం తాడిపత్రి రాజకీయాలు మాత్రం హాట్‌హాట్‌గా ఉన్నాయని చెప్పవచ్చు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాడిపత్రిని విడిచివెళ్లాలన్న పోలీసులు
సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న తాడిపత్రిలోకి అడుగుపెట్టిన పెద్దారెడ్డి
24 గంటలు కాకముందే తాడిపత్రి నుంచి… https://t.co/Kkhq0bMZqI pic.twitter.com/gxjty5ADjL
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025