OTT Movie : ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ ఇన్విస్టిగేషన్ సినిమాల హడావిడి నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమాలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటికి తోడు, స్టోరీలో ఒక సీరియల్ కిల్లర్ ఎంట్రీతో కథను థ్రిల్లర్ వైబ్ కి తీసుకెళ్తున్నారు దర్శకులు. ఇక మలయాళం సినిమాలు కూడా ఇదే దారి పట్టాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సస్పెన్స్, ట్విస్టులతో నడుస్తుంది. ఒక పోలీసు ఆఫీసర్, నగరంలో జరిగే మహిళల మర్డర్స్ విచారిస్తూ, ఒక డేంజరస్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఈ కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సినిమాపేరు ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘అమలా’ (Amala) 2023లో వచ్చిన మలయాళం సైకలజికల్ థ్రిల్లర్ మూవీ. నిషాద్ ఇబ్రహీం మొదటి సారిగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో బేసిల్ (అప్పాని శరత్), శెరిన్ (అనార్కలి మారికర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2023 జూన్ 16 నుంచి Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక మహా నగరంలో రాత్రి సమయంలో వయసులో ఉన్న మహిళలు చనిపోతుంటారు. ఈ చావులు సాధారణమైనవి కావు. ఎవరో వాళ్ళని దారుణంగా చంపుతుంటారు. అన్నీ మర్డర్స్. పోలీసులకు ఎలాంటి క్లూ లేదు. బేసిల్ అనే పవర్ ఫుల్ ఆఫీసర్ కి ఈ కేసు అసైన్ అవుతుంది. అతను ఈ హత్యలను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఒక రోజు అతను శెరిన్ అనే మూగ అమ్మాయిని కలుస్తాడు. శెరిన్ గర్భిణిగా ఉంటుంది. అయితే ఆమె మూగ మహిళా కావడంతో ఏమీ మాట్లాడలేక పోతుంది. కానీ ఆమె కళ్లలో భయం కనిపిస్తుంది. బేసిల్ ఆమెను చూసి, ఆమె దగ్గర ఏదో రహస్యం ఉందని అనుమానిస్తాడు. అక్కడ శెరిన్ సైగలతో కొన్ని క్లూస్ ఇస్తుంది. బేసిల్ ఆమె సహాయంతో మర్డర్స్ వెనుక నిజం వెతకడం మొదలెడతాడు.
Read Also : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా