ఈ మధ్య కొంత మంది కుర్రాళ్లు చేస్తున్న పనులు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. మనుషులు రోజు రోజుకు ఎందుకు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. సదర్ బజార్ ప్రాంతం సమీపంలో ఒక యువకుడు రన్నింగ్ కారు కిటికీ నుంచి మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
సోహ్నా చౌక్ నుంచి శివ మూర్తి వైపు సదరు యువకుడు థార్ లో ప్రయాణిస్తున్నప్పుడు సదర్ బజార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సోహ్నా చౌక్ నుంచి శివ మూర్తి బ్లాక్ థార్ ఎక్కువ స్పీడ్ దూసుకొచ్చింది. అదే సమయంలో సదర్ బజార్ కు చేరుకున్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేసి, తన ప్యాంటు జిప్ విప్పి, కదులుతున్న కారు నుండి మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని థార్ వెనుక కారులో కూర్చున్న వ్యక్తి తీశాడని తెలుస్తోంది.
ఇక ఈ ఆ కారులో ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వారంతా మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు. కారు లోపల లోపల మద్యం సీసాలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో కారు నడిపే డ్రైవర్ తో పాటు ఆ యువకుడు కూడా ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడించారు.
🚨 Gurugram Shock!
A youth in a Thar SUV seen urinating from a moving car — caught on camera near Sadar Bazar, #Gurugram
The video, filmed by another biker behind the vehicle, has gone #viral 🚔#ViralVideo #Thar #RoadRage #HaryanaPolice #GurugramNews #SocialMedia #BREAKING pic.twitter.com/8syMWHouli
— Indian Observer (@ag_Journalist) October 23, 2025
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “అమ్మా బాబులు బాగా సంపాదించిన డబ్బులతో జల్సాలు చేసే వారు.. ఇలాంటి చెత్త పనులే చేస్తారు” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి వారిని లోపల వేసి చితక్కొడితే, మరికొంత మంది భయపడే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలా పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ ఘటన ఓ సిగ్గులేని తననాకి నిదర్శనంగా నిలుస్తోంది. ‘మిలీనియం సిటీ’లో నివసిస్తున్న యువతలో కనీస జ్ఞానం లేకపోవడాన్ని కూడా రుజువు చేస్తుంది” అని ఇంకో వ్యక్తి వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
Read Also: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!