E-Paper
Advertisement

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!
Advertisement

SBI Credit Card Charges: ‘ఎస్‌బీఐ కార్డ్’ (SBI Card) తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇంధనం, రవాణా లావాదేవీలపై కొత్త ఛార్జీలను వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. రూ.30 వేలు దాటిన లావాదేవీపై 1 శాతం అదనపు రుసుము వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్ బీఐ కార్డ్ ప్రకటించింది. అయితే ఈ 1 శాతం వడ్డన ప్రత్యేక మర్చంట్ క్యాటగిరీ కోడ్‌ల (MCC) కింద గుర్తించిన లావాదేవీలకే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఉదాహరణకు డిసెంబర్ 1 తర్వాత రూ. 35,000 రవాణా చెల్లింపు చేస్తే దానిపై 1 శాతం అంటే రూ. 350 అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ. 30,000 లేదా అంతకంటే తక్కువ విలువైన సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. ఈ ఛార్జీలు MCC 4111, 4784, 4131 కోడ్‌ల కింద నమోదయ్యే లావాదేవీలకు వర్తించనున్నాయి. సరకు రవాణా, టోల్స్, బ్రిడ్జి ఫీజులు, బస్సు సర్వీసులు వంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయని ఎస్ బీఐ కార్డ్ స్పష్టం చేసింది.

Advertisement

మరోవైపు ఒక బిల్లింగ్ సైకిల్ లో మెుత్తం పెట్రోల్, డీజిల్ లావాదేవీ పరిమితి రూ.50వేలు దాటితే మొత్తం ఫ్యూయల్ ఖర్చుపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక నెలలో పెట్రోల్ లేదా డీజిల్ కోసం రూ. 60,000 ఖర్చు చేశారనుకుంటే ఇక్కడ రూ. 50,000 దాటిన రూ. 10,000 పైనే కాకుండా మొత్తం రూ. 60,000 పైనా 1% చొప్పున రూ. 600 అదనపు ఛార్జీ పడనుంది. ఈ ఇంధన ఛార్జీలు MCC 5172, 5541, 5542, 5983 కోడ్‌ల పరిధిలోకి వచ్చే లావాదేవీలకు మాత్రమే వర్తించనున్నాయి.

Also Read: మియాపూర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ!

Advertisement

కాగా, ఈ రెండు రకాల ఛార్జీల పరిమితులు వేర్వేరుగా ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. రవాణా ఖర్చులు ప్రతీ లావాదేవీ ఆధారంగా.. ఇంధన ఖర్చులు ఒక నెల బిల్లింగ్ సైకిల్ ఆధారంగా లెక్కించబడతాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే ముందు ఖర్చుల సరళిని సరిచూసుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు. అయితే ఈ నిబంధనల వల్ల సాధారణ వినియోగదారులపై ప్రభావం తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వ్యక్తిగత కార్డులు వాడేవారిపైనా, అధిక ప్రయాణ ఖర్చులు చేసేవారిపై ఈ ఫీజుల భారం పడుతుందని పేర్కొంటున్నారు.

Also Read: రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

Tags

Related News

నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!

దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొంటున్నారా? ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి

రైతుల్లో అప్పుడే ఆనందం.. శుక్రవారం నిధులు విడుదల, రూ. 2 వేలకు ఎవరు అర్హులు?

టీ స్టాల్, కిరాణా, కూరగాయల బండి.. అందరికీ GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి? చిన్న వ్యాపారులకు ఫైలింగ్ రూల్స్ ఇవే

సంపాదన ఎంత అనేది ముఖ్యం కాదు.. నెల చివరిలో పొదుపు చేయాలంటే ఈ 5 టిప్స్ పాటించండి

జియో ఐపీఓ లిస్టింగ్ ఈవెంట్‌లో.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేష్ అంబానీ!

రోజుకు రూ.200 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ.20 లక్షలు.. ఈ SIP లెక్కలు చూడండి!

Big Stories

Advertisement
×