E-Paper
Advertisement

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!
Advertisement

Musi Beautification: సాగునీళ్లు లేక, కరెంట్ కోతలతో ఓవైపు పంటలు ఎండిపోతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎవరు అడిగారు మూసీ సుందరీకరణ? డీపీఆర్ లేకుండానే రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ అడిగారా లేక సోనియా గాంధీ అడిగారా..? అని నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టును వెంటనే ఆపి, ఆ లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలని కోరారు.

తెలంగాణ భవన్ లో గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాగునీటికి కష్టాలు ఉన్నప్పటికీ లక్షన్నర కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా, తాగునీటి ఎద్దడి ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు కేటాయించి దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. మూసీ సుందరీకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలను, బాధితులను, ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వకుండా అణచివేశారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మూసీ బాధితుల తరఫున, ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.

Advertisement

మూసీ సుందీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీలో లూటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఉందా? అని ప్రశ్నించారు. నీళ్లు లేక హైదరాబాద్ ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మల్లన్నసాగర్ నుంచి 10 టీఎంసీలు తీసుకొచ్చి మూసీలో పోస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. ‘కాంగ్రెస్ వాళ్లు మేడిగడ్డ పిల్లర్లను కుల్చేసి మూడేళ్లు అయింది. పోలీస్ కంప్లైంట్ చేస్తే విచారణ జరిపే, రిపేర్ చేసే సోయి లేదు’ అని కేటీఆర్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుల నుంచే క్రాప్ హాలీడే మాటలు వినిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదని ఈరోజు నిజమే అవుతోందన్నారు.

Also Read: SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!

Advertisement

కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకం అయితే.. కాంగ్రెస్ హయాంలో ట్యాంకర్ల ఎత్తిపోతల పథకం అని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతులు తమ పంటల్ని తామే తగలబెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటే మీ కర్మ అనేలా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. గత హయాంలో కేసీఆర్ ఒక్క నీటి బొట్టు కిందకు పోకుండా ఒడిసిపట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో కుదేలు అవుతుంటే బాధ వేస్తుందన్నారు. మనకంటే తక్కువ వర్షపాతం నమోదైన ఏపీ, మహారాష్ట్రలో కరువు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ఏపీలో కరువు లేదని చంద్రబాబు ముందు చూపుతో నీళ్లు ఎత్తిపోసుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. దీంతో అక్కడ కరువు, క్రాప్ హాలీడే లేదన్నారు. ఈ విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని తెలిపారు.

Also Read: కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

హుజురాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివాదం.. కోర్టు ఉత్తర్వులున్న భూమిలో నిర్మాణం!

జగిత్యాల జిల్లాలో ఓ రైతు అద్భుత ఆలోచన.. సన్నవడ్ల కొనుగోలులో సంచలనం!

మియాపూర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ!

కొండా సురేఖ క్షమాపణపై కేటీఆర్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!

జగిత్యాల శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం.. బొమ్మకు సూదులు గుచ్చి..?

Big Stories

Advertisement
×