Miyapur Land Dispute: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్‌లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలపై నెలకొన్న దీర్ఘకాలిక వివాదానికి అత్యున్నత నాయస్థానం తెరదించింది. సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సుమారు 550 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలంపై ప్రభుత్వానికే పూర్తి హక్కులు దక్కుతాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్వపు జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధ వారసుల ద్వారా తమకు ఈ ఆస్తులపై హక్కులు సిద్ధించాయని పార్థసారధి, సువిశాల్ జైన్ అనే వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఉన్న ‘సనద్’, ‘జీపీఏ’ (Irrevocable GPA) పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే గతంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ తీసుకున్న జీపీఏ రద్దు నిర్ణయం చెల్లదని తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వ న్యాయవాదులు ఈ వాదనలను గట్టిగా తిప్పికొట్టారు. సదరు జాగీర్దార్ కుటుంబానికి అప్పట్లోనే ప్రభుత్వం నుంచి పరిహారం అందడంతో ఆ భూములపై వారి వారసులకు గానీ, వారి నుంచి పొందినట్లు చెప్తున్న వ్యక్తులకు గానీ ఎలాంటి హక్కులూ ఉండవని ఆధారాలతో నిరూపించారు.
Also Read: కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఆలకించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రజల ఉమ్మడి ఆస్తి అయిన ఈ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహించబోవని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికే పూర్తి హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పింది. దీంతో 2003 నుంచి కొనసాగుతున్న ఈ భూముల వివాదానికి సుప్రీంకోర్టులో బ్రేక్ పడినట్లైంది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పులో సర్వే నెంబర్ 100,101 పరిధిలోని సుమారు 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు ప్రభుత్వానికి దక్కినట్లైంది.
Also Read: జియో ఆల్ రౌండర్ ప్లాన్.. రూ.399 కే అపరిమిత 5G, కాల్స్, ఓటీటీలు.. రూ.39,000 విలువైన సేవలు ఫ్రీ!