E-Paper
Advertisement

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?
Advertisement

కేసీఆర్ తరచూ సోనియా చేసిన ఓ తప్పిదాన్ని గుర్తు చేస్తూ ఉంటారట తన సన్నిహితుల వద్ద. అవకాశం వచ్చినప్పుడు ఓసారి రాహుల్‌ను ప్రధాని చేయాల్సింది ఉండే..! అని ఆయన భావన. కానీ సోనియా గాంధీకి ఈ అవకాశం వచ్చినా.. చేజేతులా జారవిడుకున్నారనే వ్యాఖ్యలు కేసీఆర్ చాలా సార్లు చేశారట.

‘ఒక్కసారి ఆయనను ప్రధానిని చేసి వదిలేస్తే.. ఆ తరువాత మాజీ పీఎంగా తనకంటూ ఓ ట్రెండ్‌ సెట్‌ చేసుకుని ఉండేవారు. కానీ అలా చేయడంలో ఆమె విఫలమయ్యారు.. అలాంటి తప్పిదాన్ని నేను చేయను.. !’ అని చెప్పేవారట ఆయన. ‘శకునం తెలిసిన బల్లి చివరకు కుడితిలో పడి చచ్చినట్టు..’ అన్నీ తెలిసినా.. కొడుకును సీఎంను మాత్రం చేయలేక చతికిలబడ్డారు కేసీఆర్‌.

Advertisement

ఇప్పుటికీ ఇంకా ఆయనకు ఇదే చివరి రాజకీయ సంకల్పంగా ఉంది. అందుకే ఈసారి కచ్చితంగా అధికారంలోకి రాగానే కేటీఆర్‌ను సీఎం చేయడమే మిగిలుంది అంటున్నారు బీఆరెస్‌ సీనియర్‌ నేతలంతా. ఇప్పుడిదంతా ఎందుకంటే.. సోనియాగాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్‌.. ఓ జర్నీ ఆఫ్‌ లవ్‌!’ పుస్తకం రిలీజ్‌ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్‌ పొలిటికల్ సర్కిళ్లలో కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.

రాజీవ్‌ను ప్రధాని అవుతానంటే వ్యతిరేకించానని ఆమె చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో.. రాహుల్‌ ప్రధాని అవకాశాన్ని జార విడుచుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ రాహుల్‌ను ప్రధానిని చేసే చాన్స్‌ ఉన్నా.. సోనియా సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ పదేండ్ల పాలనలో పలుసార్లు కేటీఆర్‌ను సీఎం చేద్దామన్నా.. ఏదో ఒక ఆటంకం దాన్ని కానీయకుండా కాళ్లకు అడ్డం పడింది. తీరా ఇప్పుడు అధికారమే దూరమైంది.

Advertisement

కానీ కేసీఆర్‌ మనసులోని సంకల్పం మాత్రం ఇంకా బలంగానే ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. కేటీఆర్‌కు ఆటంకంగా మారుతుందనే భయంతోనే కవితను కూడా పార్టీ, కుటుంబం నుంచి తరిమేసేదాకా కేసీఆర్ పోయాడంటే.. కేటీఆర్‌ను సీఎం చేయాలనే ఆయన సంకల్పం ఎంతబలంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే కామెంట్స్‌ గులాబీ నేతల నుంచి వస్తున్నాయి.

అక్కడ సోనియా ఇప్పుడు రాహుల్‌ను ప్రధానిగా చూడాలని ఎంత తహతహలాడుతున్నారో.. ఇక్కడ కేసీఆర్ కూడా తన కొడుకును సీఎం చేయడానికి అంతే తండ్లాటతో ఉన్నారని అనుకుంటున్నారు. ‘సోనియా లాగా నేను ఆ తప్పిదం చేయను… చేయను’ అని పదే పదే తన అంతరంగీకుల వద్ద చెబుతూ వచ్చిన కేసీఆర్.. కాలం కలిసిరాక ఇప్పుడు మళ్లీ తన టైం కోసం ఎదురుచూస్తున్నాడు.

అయితే ఈ ఓడిన సమయం కొడుకు రాజకీయ అనుభవానికి ఉపయోగపడుతుందని భావించిన కేసీఆర్‌.. పార్టీ పగ్గాలు అప్పగించి తను ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యడు. కానీ కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకునే క్రమంలో కేటీఆర్‌ సక్సెస్‌ కాలేకపోతున్నాడు. తనదైన దూకుడు వ్యూహాన్ని అమలు చేసే క్రమంలో.. అవి బూమరాంగై పార్టీని డ్యామేజ్‌ చేసే విధంగా ఉండటంతో సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

అటు తండ్రితో చెప్పలేరు.. ఇటు కొడుకు వెంట నడవలేరు..! తప్పదు కాబట్టి ఆయన్ను భారంగా మోస్తున్నట్టుగానే సీనియర్ల తీరు ఉంటుందనే విమర్శలున్నాయి. తాజాగా కేటీఆర్‌ నోటి వెంట జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ మళ్లీ కీ రోల్ పోషిస్తారనే కామెంట్‌ రావడం మరింత బూమరాంగైందని భావిస్తున్నారు.

ఇక్కడ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకేం కాదని తెలిసినా.. ఇప్పుడు జాతీయ రాజకీయాల ముచ్చటెందుకు? అని ఆ పార్టీ నేతలే నిలదీసే పరిస్థితులు వచ్చాయి. సోనియా తను టైం కోసం ఎదురుచూసే క్రమంలో లక్ష్యానికి చేరువవుతున్న పరిస్థితులు కనిపిస్తే.. తన లక్ష్య సాధనలో ఈసారైనా కాలం కలిసి వస్తుందా? అనే డైలామాలో కేసీఆర్‌ ఉన్నాడు.

Tags

Related News

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×