Gold Rate Today: బంగారం ధరలు పరుగులు పెడుతుంది. బంగారం వైపు చూడలంటేనే భయంగా ఉంటుంది. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,930 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,290 వద్ద పలుకుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,850 ఉండగా.. మంగళవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.1,360 పెరిగింది.
భయపెడుతున్న బంగారం రేట్లు..
బంగారం రేట్లు 20 రోజుల్లోనే 10 వేలు పెరిగిపోయింది. ఇలా రోజు పెరుగుతు పోతే పాపం పసిడి ప్రియులు ఏమైపోతారు. నిపుణులు చెప్పినట్టుగానే నాలుగు రోజులైతే లక్షన్నర అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లకు బంగారం కొనాలనే ఆశా కూడా చంపుకోవాల్సిందేనేమో.. ముఖ్యంగా సామాన్య ప్రజలు అయితే వాటిని కొనాలి అనే ఆశ కూడా చంపుకుంటున్నారు.. మధ్య తరగతి వారు ఇంకా వన్ గ్రాం గోల్డ్ వైపు దారి మల్లించాల్సిందేనా.. ఇప్పుడు వన్ గ్రాం గోల్డ్ కూడా రేట్లు పెరుగుతాయేమో.. అందరు వచ్చి వీటిపైనే పడితే వారు కూడా ధరలు పెంచుతారు. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్..
బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధర భారీగా జరిగేందుకు డాలర్ విలువ పతనం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,10,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,100 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,100 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,01,250 వద్ద నిలిచింది.
Also Read: NRIలపై దాడులు, నిరసనలు.. మనోళ్లంటే ఎందుకంత కోపం?
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలు ఎంత పెరిగిన సిల్వర్ ధరలు మాత్రం మంగళవారం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం కేజి సిల్వర్ ధర రూ.1,40,000 వద్ద పలుకుతోంది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,30,000 వద్ద కొనసాగుతోంది.