BigTV English

BIG WARNING for NRIs: NRIలపై దాడులు, నిరసనలు.. మనోళ్లంటే ఎందుకంత కోపం?

BIG WARNING for NRIs: NRIలపై దాడులు, నిరసనలు.. మనోళ్లంటే ఎందుకంత కోపం?

BIG WARNING for NRIs: ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉన్న NRIలపై అక్కడి వారిలో ద్వేషం పెరిగిపోతోంది. హేటర్స్ పెరుగుతున్నారు. మనోళ్లు ఏ ఉత్సవాలు చేసుకున్నా వాటిని నెగెటివ్ గా చూస్తున్నారు. మనవాళ్లు చదువుకున్నా.. ఉద్యోగాలు చేస్తున్నా.. చాలా అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వినాయక నిమజ్జనాల సందడిని కూడా టార్గెట్ చేస్తున్నారు కొందరు.


ఇండియన్లకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ర్యాలీ

ఇది మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీ. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, కాన్ బెర్రా, అడిలైడ్, పెర్త్, హోబర్ట్ వంటి మెయిన్ సిటీస్ లో ఆగస్ట్ 31న జరిగాయి. మాస్ ఇమ్మిగ్రేషన్ ను వ్యతిరేకిస్తూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆస్ట్రేలియా సంస్కృతి, జీవన విధానం, సామాజిక ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చాయి. ఇందులో ఇండియన్లనే ఎక్కువ టార్గెట్ చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన ఇండియన్లు.., గత వందేళ్లలో వచ్చిన గ్రీక్స్, ఇటాలియన్స్ కంటే ఎక్కువ అని అన్నారు. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2023 జూన్ నాటికి 8.4 లక్షల మంది భారత సంతతి వలసదారులు ఉన్నారు. ఇది యూకే తర్వాత ఆస్ట్రేలియాలోనే ఎక్కువ మంది స్థిరపడ్డారు. 2021 సెన్సస్ ప్రకారం NRIలు ఆస్ట్రేలియా జనాభాలో 3.2% ఉన్నారు. ఆస్ట్రేలియన్లలో కొందరు ఇలా రోడ్డెక్కడానికి కారణాలు ఉన్నాయి. వలస వచ్చే ఇండియన్లు, ఇతర దేశాల వారు పెరగడంతో ఆస్ట్రేలియాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయట. దీంతో యువ ఆస్ట్రేలియన్లు ఇళ్లు కొనడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్లు ఎక్కువమంది రావడం, ఇండ్లు కొనడంతోనే రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు. వీటికి తోడు లివింగ్ కాస్ట్ పెరగడం, హాస్పిటల్స్ లో వెయిటింగ్ టైం పెరగడం, రోడ్లపై ట్రాఫిక్, ఉపాధి అవకాశాల కొరత వీటన్నిటికీ కారణం వలసలు వచ్చిన వారే అని ఆస్ట్రేలియన్లు విమర్శిస్తున్న పరిస్థితి. జనాభా పెరుగుదలతో బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉందని, అయినా సరే తమ ప్రభుత్వం మరింతమంది వలసదారలకు డోర్లు బార్లా తెరుస్తున్నారన్నది నిరసనకారుల వాదన.


ఆస్ట్రేలియన్ సంస్కృతిని మార్చేస్తున్నారన్న ఆరోపణలు

NRIలు, ముఖ్యంగా ఐటీ, మెడిసిన్, అకడమిక్స్ లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్నారు. వలసదారులు తక్కువ వేతనాలకు పనిచేస్తూ, స్థానికుల ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తున్నారని కొందరు ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా నిరసనల్లో ఇది సాంస్కృతిక మార్పు కాదని, ఇది రీప్లేస్‌మెంట్ అని స్లోగన్స్ ఇచ్చారు. NRIలు ఆస్ట్రేలియన్ సంస్కృతిని మార్చేస్తున్నారని ఆరోపించారు. జాత్యహంకార నినాదాలను వాడారు. వలసల వల్ల ఆస్ట్రేలియా సామాజిక ఐక్యత దెబ్బతింటుందని వాదిస్తున్నారు. NRIలలో చాలా మంది లేబర్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని మరికొందరు అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న సిడ్నీలో రైలులో ఇద్దరు భారతీయ మహిళా విద్యార్థులపై దాడి జరిగింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అలర్ట్

భారతీయ వలసదారులు, ముఖ్యంగా విద్యార్థులు యువ ప్రొఫెషనల్స్ ఈ నిరసనలతో భయాందోళనతో ఉన్నారు. వీటిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అలర్ట్ గా ఉంటోంది. అలాగే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది కూడా. నిజానికి భారతీయ వలసలను రీప్లేస్‌మెంట్ గా చిత్రీకరించడం తప్పుడు ఆరోపణ. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మనోళ్లు వలస వెళ్లారన్నది వాస్తవం. ఒకవేళ వారు వీసాలు ఇవ్వకపోతే భారత్ నుంచి ఎందుకు వెళ్తారు.. ఈ మాత్రం బుద్ధి ఆస్ట్రేలియన్లకు ఉండాలి. పైగా మనోళ్లు అక్కడ పెట్టే చదువు ఖర్చులతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికే చాలా ఆదాయం వస్తోంది. ట్యూషన్ ఫీజులు, నివాసం ఉండేందుకు మనవాళ్లు పెడుతున్న ఖర్చు అక్షరాలా 9 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు. విదేశీ విద్యార్థుల చదువులతో ఆస్ట్రేలియా ఎకానమీకి 47.8 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అందుతోంది. బయటి నుంచి వచ్చిన వారితో హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ సహా ఇతర రంగాల్లో రెండున్నర లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇవన్నీ చూడకుండా మా ఉద్యోగాలు పోతున్నాయ్.. మా సంస్కృతి ధ్వంసమవుతోంది.. మాకు ఇండ్లు దొరకట్లేదంటున్నారు. ఇదీ పరిస్థితి. బాగుంటే చూడలేని పరిస్థితి.

విదేశాల్లో మనోళ్లు ఉత్సవాలు చేసుకున్నా ఓర్వలేరు. ఎవరికీ హాని చేయకుండా మన సంప్రదాయాలను పాటించినా ఏదో దాడి జరిగిపోతోందన్నట్లుగా చూస్తున్నారు. ఇటీవల అమెరికాలోని పలు ప్రధాన నగరాలైన డల్లార్, హ్యూస్టన్, టెక్సాస్ వంటి చోట్ల NRIలు, ముఖ్యంగా తెలుగువాళ్లు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిపారు. వాటిపైనా అక్కసు వెళ్లగక్కేలా కొందరు అమెరికన్లు పోస్టులు పెట్టారు. వీటికి తోడు మన NRIల్లో కొందరు వాళ్ల దగ్గర ఇంటికో గన్ ఉంటుంది.. కాల్చేస్తారన్న కామెంట్లూ చేసిన పరిస్థితి.

నిమజ్జనాలపై అమెరికన్ నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు

ముఖ్యంగా డల్లాస్‌లో రోడ్లపై చేసిన డ్యాన్సుల వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ అమెరికన్ మహిళా పోలీస్ ఆఫీసర్ కూడా వీళ్లతో కలిసి డ్యాన్సులు చేశారు. అయితే వీటిపై అమెరికన్ నెటిజన్లు, అలాగే మరికొందరు NRIల నుంచి విమర్శలు వచ్చాయి. విదేశాలకు వెళ్లి ఇలాగేనే చేయడం అని కొందరు అంటే.. అమెరికాలో కాలనీల్లో ఇదేం పద్ధతి అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ పిల్లల్ని అమెరికాలో పెంచాలనుకుంటున్నామని, ఇండియాలో కాదంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఇంకొందరైతే అమెరికా సంస్కృతిపైనే దాడి అన్నారు. గణేష్ నిమజ్జనం అన్నది హిందూ సంస్కృతిలో ముఖ్యమైన ఉత్సవం. NRIలు తమ సంస్కృతిని విదేశాలలో జరుపుకోవడం సహజమే. ఇది హక్కు కూడా. ఈ ఉత్సవాలు మన కమ్యూనిటీలో యూనిటీని పెంచుతాయి. మనోళ్లు చేసే ఉత్సవాలను చాలా మంది అమెరికన్లు స్వాగతిస్తారు కూడా. పైగా ఈ ఉత్సవాల ఉద్దేశం ఆనందంగా ఉండడం, భక్తిని ప్రదర్శించడమే. ఎవరిపైనా దాడి కాదు కదా. ఇండియాలో ఇలాంటి ఉత్సవాలు రోడ్లపై జరగడం కామనే కాబట్టి, NRIలు అదే విధంగా పర్మిషన్లు తీసుకుని ఇలా నిమజ్జనం ఊరేగింపు చేశారు. దీన్ని తప్పుపడితే ఎలా?

ఇంటికో గన్ ఉంటుంది కాల్చేస్తారంటూ కామెంట్లు

శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ప్లేస్‌లలో రంగులు చల్లడం వంటి వాటికి పరిమితులు ఉండొచ్చు. కొందరు స్థానికులకు అసౌకర్యం కలిగించవచ్చు. అంతేగానీ వీళ్లు ఎవరి పట్లా అనుచితంగా వ్యవహరించలేదు. ఈ విషయంలో అమెరికన్ల కంటే కొందరు NRIలే ఎక్కువ పరేషాన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికన్లకు ఇంటికో తుపాకీ ఉంటుందని, సౌండ్ ఎక్కువైతే కాల్చి పారేస్తారని కొందరు కామెంట్లు చేశారు. పర్మిషన్లు తీసుకుని ఇంతలా భయపడడమా.. అని మరికొందరు కౌంటర్ కామెంట్లు చేసిన పరిస్థితి.

ఉత్సవాలు చేసుకుంటే అమెరికా నుంచి తరిమేస్తారా?

లండన్ లో ప్రవహిస్తున్న నీటిలో ఇలా నిమజ్జనం చేశారు. దీనిపైనా అక్కడ విమర్శలు వచ్చాయి. నదుల కాలుష్యానికి కారణమవుతున్నారన్నారు. ఈ భారతీయ ఉత్సవాలకు H-1B వీసాలనూ లింక్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఇలా చేస్తున్న ఉన్న వీసాలు కూడా ఊస్టింగ్ అవడం ఖాయమని మరికొందరు కామెంట్లు చేశారు. అమెరికాలో ఏ సిటీ అయినా శబ్ద కాలుష్య నియమాలు కఠినంగా ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాలలో రాత్రి 10 గంటల తర్వాత లేదా రోజువారీ సమయాల్లో డెసిబెల్ లిమిట్స్ పెడుతారు. ఆ ప్రకారం ఉత్సవాలు చేసుకున్నా తప్పు పడితే ఎలా అన్నది మరికొందరి ప్రశ్న.

Also Read: నువ్వు లేక నేను లేను.. ప్రేమ విఫలం అయిందని జంట బలవన్మరణం

ఇప్పటికే భారతీయులపై అమెరికా చాలా ఆంక్షలు విధిస్తోంది. వీసాలపై నియంత్రణ విధించారు. మన విద్యార్థులు అమెరికన్ వర్శిటీల్లో చదువుకోకుండా ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు సామాజిక ఉత్సవాలపైనా ఇలా విద్వేషంతో పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో NRIలు కూడా పర్మిషన్లతో ఉత్సవాలు చేసుకోవడం.. ముఖ్యమే. అయితే ప్రైవేట్ స్పేస్ లలో ఇలాంటివి జరుపుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. అమెరికన్లలో అందరూ డిస్టర్బ్ కాకపోయినా కొందరు ఇబ్బందిపడే అవకాశాలు ఉంటాయి. డల్లాస్ లో అదే జరిగింది. స్థానికులతో ముందుగానే మాట్లాడి.. వారికి నిమజ్జనం ప్రాధాన్యత చెప్పడం ద్వారా కొంత వరకు అసంతృప్తి తగ్గుతుంది. పైగా స్థానిక అమెరికన్ల సహకారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వైరల్ అయ్యే వీడియోలతో రాజకీయ లేదా సామాజిక వివాదాలకు దారితీయవచ్చు. NRIలు తమ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యం. అదే సమయంలో అక్కడి సంస్కృతి చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందే. నిజానికి డల్లాస్ లో జరిగిన నిమజ్జన కార్యక్రమంపై ఇండియన్ డయాస్పొరాపై పెరుగుతున్న జాతి వివక్షను హైలైట్ చేసింది. 2025లో H-1B వీసా వివాదం, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణల నేపథ్యంలో మనోళ్లు మరింత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులను తీసుకొచ్చాయి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Nepal: సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసిన నేపాల్ ప్రభుత్వం.. కానీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

Sudan Gurung: నేపాల్ నిప్పుకణిక సుడాన్.. వీడు పిలుపిస్తే ప్రభుత్వానికి వణుకు, ఇంతకీ ఎవరతను?

Volodymyr Zelenskyy: బాగా చేశారు.. ఇండియాపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనుచిత వ్యాఖ్యలు

Trump Tariffs: అమెరికా టారిఫ్‌లతో ఇండియాకు లాభమే.. అదే జరిగితే ట్రంప్ ఏమైపోతాడో!

×